Adivi Sesh: హీరోయిన్‏తో కలిసి స్పెషల్ వీడియో షేర్ చేసిన అడవి శేష్.. రీట్వీట్ చేస్తూ నాని సెటైరికల్ ప్రశ్న..

పర్‌ఫెక్ట్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌ను గా రాబోతున్న ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇందులో హోమీసైడ్ ఇంట‌ర్‌వెన్ష‌న్ టీమ్‌లో కూల్ కాప్ అయిన కె.డి అనే పోలీస్

Adivi Sesh: హీరోయిన్‏తో కలిసి స్పెషల్ వీడియో షేర్ చేసిన అడవి శేష్.. రీట్వీట్ చేస్తూ నాని సెటైరికల్ ప్రశ్న..
Nani, Adivi Sesh
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 13, 2022 | 12:17 PM

పాన్ ఇండియా స్టార్ అడివి శేష్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం హిట్ 2. హిట్ ది ఫస్ట్ కేస్ సినిమాకు సిక్వెల్‏గా రాబోతున్న ఈ మూవీకి డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అడివి శేష్ జోడీగా న‌టించింది మీనాక్షి చౌద‌రి. ఇటీవల ఈ సినిమా నుంచి ‘ఉరికే ఉరికే..’ అనే రొమాంటిక్ వీడియో సాంగ్‌ను రిలీజైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాటకు హీరోహీరోయిన్స్ ఇద్దరూ అందంగా డాన్స్ చేశారు. ఈ వీడియోను హీరో అడివి శేష్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. నిజమే.. నేను ఉరికే ఉరికే పాటకు డ్యాన్స్ చేశాను. ఇలా డ్యాన్స్ చేయడం కాస్త సిగ్గుగానే ఉంది. అయినా మీకోసం ఏదైనా చేస్తాను అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఇప్పటివరకు బాగానే ఉంది… కానీ శేష్ షేర్ చేసిన వీడియో చూసిన న్యాచురల్ స్టార్ నాని ఇలా కూడా చేస్తారా ? అంటూ అడివి శేష్ ను ప్రశ్నించాడు.

ఇంతకీ నాని ఎందుకు ప్రశ్నించాల్సి వచ్చిందంటే.. మీనాక్షి చౌదరీ.. అడివి శేష్ కలిసి డాన్స్ చేసింది.. నాని సొంత నిర్మాణ సంస్థ అయిన వాల్ పోస్టర్ సినిమాస్ కార్యాలయంలోనే. నానికి తెలియకుండా అతడి కార్యాలయంలో అడివిశేష్.. మీనాక్షి కలిసి ఉరికే ఉరికే పాటకు డాన్స్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. నా ఆఫీస్ ను ఇలా కూడా వాడొచ్చా ? అంటూ సెటైరికల్ క్వశ్చన్ చేశాడు నాని. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ట్వీట్స్ నెట్టింట వైరలవుతుండగా.. ఫన్నీ గా రియాక్ట్ అవుతున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

ఇక పర్‌ఫెక్ట్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌ను గా రాబోతున్న ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇందులో హోమీసైడ్ ఇంట‌ర్‌వెన్ష‌న్ టీమ్‌లో కూల్ కాప్ అయిన కె.డి అనే పోలీస్ ఆఫీస‌ర్‌గా అడివి శేష్ క‌నిపించ‌బోతున్నారు.రావు ర‌మేష్‌, పోసాని కృష్ణ ముర‌ళి, త‌నికెళ్ల భ‌ర‌ణి, శ్రీనాథ్ మాగంటి, కోమ‌లి ప్ర‌సాద్ల కీలకపాత్రలలో నటిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.