Ram Charan: రంగమ్మ.. మంగమ్మ.. పాటకు అక్షయ్‏తో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన చరణ్.. వైరలవుతున్న వీడియో..

ఢిల్లీలో నిర్వహించిన హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తో కలిసి చరణ్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈషోలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Ram Charan: రంగమ్మ.. మంగమ్మ.. పాటకు అక్షయ్‏తో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన చరణ్.. వైరలవుతున్న వీడియో..
Ram Charan Akshay
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 13, 2022 | 1:54 PM

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‏కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆర్సీ 15 సినిమాతో బిజీగా ఉన్నారు చరణ్. కేవలం నటన పరంగానే కాకుండా.. చెర్రీ డ్యాన్స్‏లోనూ ఓ స్టైల్ ఉంటుంది.తండ్రి మెగాస్టార్ చిరంజీవికి ఏమాత్రం తీసిపోకుండా.. అద్బుతమైన స్టెప్పులతో మెస్మరైజ్ చేస్తుంటారు. ఇక చరణ్ ఒంటరిగా కాకుండా బాలీవుడ్ స్టార్ హీరోతో ఒకే స్టేజ్ పై కాలు కదిపితే ఎలా ఉంటుంది. చూసేందుకు రెండు కళ్లు చాలవు కదా. ఇక తాజాగా అలాంటి సన్నివేశమే సినీ ప్రియుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి సౌత్, నార్త్ పాటలకు స్టెప్పులేస్తూ ప్రేక్షకులను అలరించారు చరణ్. ఢిల్లీలో నిర్వహించిన హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తో కలిసి చరణ్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈషోలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే చరణ్ నటించిన రంగస్థలం సినిమాలోని రంగమ్మ.. మంగమ్మ.. పాటకు డ్యాన్స్ చేసింది అదరగొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పొలిటికల్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. ఈచిత్రాన్ని దిల్ రాజు పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదే కార్యక్రమంలో ఆర్సీ15 సినిమా గురించి అడగ్గా.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉందని.. అప్డేట్ గురించి తనకేమి తెలియదని..ఆ విషయాలు శంకర్ సర్‏ను అడగాలని.. నేను కూడా మీలాగే ఎదురుచూస్తున్నాని చెప్పుకొచ్చారు. కేవలం తాను షూట్ చేసి రావడమే అని.. శంకర్ సర్ ఏది చెప్తే అది చేస్తున్నానని అన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.