Teaser Talk: స్టోరీ సెలక్షన్స్‌లో మార్క్ చూపిస్తోన్న బెల్లంకొండ వారసుడు.. మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో..
బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్ సినిమా సెలక్షన్స్‌లో తన మార్కును చూపిస్తున్నాడు. భారీ చిత్రాలు కాకుండా ఫిల్మ్ గుడ్ మూవీస్‌ను సెలక్ట్ చేసుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తొలి చిత్రం 'స్వాతిముత్యం'తో ప్రేక్షకులకు...

బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్ సినిమా సెలక్షన్స్‌లో తన మార్కును చూపిస్తున్నాడు. భారీ చిత్రాలు కాకుండా ఫిల్మ్ గుడ్ మూవీస్‌ను సెలక్ట్ చేసుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తొలి చిత్రం ‘స్వాతిముత్యం’తో ప్రేక్షకులకు మెస్మరైజ్ చేశాడు. డిఫ్రెంట్ కాన్సెప్ట్‌తో అనవసరమైన ఎలివేషన్స్ లేకుండా కేవలం కథా బలంతోనే తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవలే ఆహా ఓటీటీ వేదికగా విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో రెండో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
గణేష్ నటిస్తోన్న తాజా చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. కృష్ణచైతన్య కథ, స్క్రీన్ ప్లేతో రాఖీ ఉప్పలపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. దర్శకుడు వీవీ వినాయక్ టీజర్‌ను లాంచ్ చేశాడు. 1.11 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ ఆద్యంతంత ఆసక్తికరంగా ఉంది. టీజర్‌ను గమనిస్తే గణేశ్ మరో ఆసక్తికరమైన కథాంశంతో వస్తున్నట్లు అర్థమవుతోంది.



ఎంతో ఇష్టపడి ఐఫోన్‌ను కొనుగోలు చేసిన ఓ కుర్రాడు కంప్లైట్ చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళితే.. అతని జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి అన్న ఆసక్తికర పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ.. ‘టీజర్ బాగుంది. ఈ సినిమాతో గణేష్‌కు మరో విజయం దక్కాలి. ‘నాంది’ వంటి సినిమాను నిర్మించిన సతీష్ వర్మ సంస్థలో గణేష్ సినిమా చేయడం సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చారు. మరి తొలి సినిమాతో ప్రేక్షకులకు ఆకట్టుకున్న గణేష్ రెండో చిత్రంలో ఏమేర ఆకర్షిస్తారో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..