Ram Charan-Akshay Kumar: సినిమా ప్లాప్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రామ్ చరణ్, అక్షయ్ కుమార్.. ఏమన్నారంటే ..

సినిమాలు డిజాస్టర్స్ కావడంపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీలో నిర్వహించిన హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ కార్యక్రమంలో

Ram Charan-Akshay Kumar: సినిమా ప్లాప్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రామ్ చరణ్, అక్షయ్ కుమార్.. ఏమన్నారంటే ..
Ram Charan, Akshay Kumar
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 13, 2022 | 1:14 PM

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ వరుస డిజాస్టర్స్‏తో విలవిలలాడిపోతుంది. భారీ బడ్జెట్‏తో తెరకెక్కిన స్టార్ హీరోస్ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద పరాజయం చవిచూస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన రామ్ సేతు సినిమా సైతం అంతగా ఆకట్టుకోలేకపోయింది. కేవలం డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్, అలియా నటించిన బ్రహ్మస్త్ర మాత్రమే కొద్దిగా కలెక్షన్స్ రాబట్టింది. మరోవైపు సౌత్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలవడమే కాకుండా భారీగా వసూళ్లు రాబడుతున్నాయి. ఈ క్రమంలోనే సినిమాలు డిజాస్టర్స్ కావడంపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీలో నిర్వహించిన హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తో కలిసి రామ్ చరణ్ సందడి చేశారు. ఈ క్రమంలోనే సినిమాలు హిట్ కాకపోవడంపై స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. ” ప్రస్తుతం సమాజంలో అనే విషయాలు మారాయి. ప్రేక్షకులు డిఫరెంట్‌గా కోరుకుంటున్నారు. సినిమాలు హిట్ కాకపోవడమనేది మా తప్పు. ప్రేక్షకులది కాదు. వాళ్ళు థియేటర్లకు రావాలంటే వారికి కావాల్సినవి మనం ఇవ్వాలి. మేము మళ్లీ మళ్లీ ప్రారంభించాలి.. కొత్త కథలు తేవాలి. జనాలకు ఏం కావాలో మేము అర్థం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ప్రజలు వినోదం కోసం ఎక్కువగా ఖర్చు పెట్టాలనుకోవడం లేదు. కానీ థియేటర్లలో టికెట్స్ రేట్లు కూడా పెరిగాయి. అలాగే ఫిలిం మేకింగ్ కాస్ట్ తగ్గించుకోవాలి. మేము కూడా ఖర్చులు.. మా రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి.” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మెగా పవర్ స్టా్ర్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. ” స్క్రీప్ట్ నుంచి మేకింగ్ వరకు .. ఎగ్జిబిటర్ వరకు ప్రతిదీ పునరాలోచించుకోవాలి. మంచి కథ ఉంటే ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. నేను ఆర్ఆర్ఆర్ తర్వాత అతిథి పాత్రలో నటించిన ఆచార్య సినిమా చూసేందుకు జనాలు రా లేదు. కానీ మంచి కథలు ఉన్న సినిమాల కోసం ప్రజలు వస్తారు. మా సౌత్ లో కూడా పాప్ కార్న్, సమోసా రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫిలిం మేకింగ కాస్ట్ తగ్గడానికి మా రెమ్యునరేషన్స్ కూడా తగ్గించుకుంటున్నాము ” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో చరణ్, అక్షయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతున్నాయి.