AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: గీతా ఆర్ట్స్ ఆఫీస్ ఎదుట అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆందోళన.. కారణం ఏంటంటే..

అలాగే పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Allu Arjun: గీతా ఆర్ట్స్ ఆఫీస్ ఎదుట అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆందోళన.. కారణం ఏంటంటే..
Actor Allu Arjun
Rajeev Rayala
|

Updated on: Nov 14, 2022 | 6:53 AM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గురించి ఆయన ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న టివరకు స్టైలిష్ స్టార్ గా ఉన్న బన్నీ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా ఎదిగాడు. అలాగే  పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊరమాస్ పాత్రలో కనిపించి  ఆకట్టుకున్నారు. బన్నీ నటన ఈ సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించి మెప్పించింది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు పుష్ప 2 కోసం అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

అయితే ఇంతవరకు పుష్ప 2 షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో మొదలైన విషయం తెలిసిందే. బన్నీ లేకుండానే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు సుకుమార్. త్వరలోనే బన్నీ కూడా హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే పుష్ప 2 అప్డేట్స్  కకావాలంటూ బన్నీ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఏ ఏ క్రమంలోనే  హైదరాబాద్‌లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు పెద్ద సంఖ్యలో అల్లు అర్జున్ అభిమానులు నిరసన వ్యక్తం చేశారు.

పుష్ప 2 అప్డేట్స్ వెంటనే ఇవ్వాలి అంటు ఫ్యాన్స్ ఆందోళన చేశారు. పుష్ప రిలీజ్ అయ్యి సంవత్సరం కావస్తున్నా ఎటువంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు అంటున్న ఫ్యాన్స్ ఆందోళ చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి వచ్చిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు నిరసనకు దిగారు. ఇంకా లేట్ చేస్తే మైత్రి ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం అంటున్న ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారు. మరి ఈ వ్యవహారం పై సుకుమార్ టీమ్ స్పందిస్తారేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?