Unstoppable with NBK S2: బాలయ్య షోకు ఊహించని గెస్ట్.. అన్ స్టాపబుల్‌లో రచ్చ డబుల్

బాలాకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో టెలికాస్ట్ అవుతున్న విషయం తెలిసిందే. మొదటిసారి బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో గురించి ఎంత చెప్పిన తక్కువే..

Unstoppable with NBK S2: బాలయ్య షోకు ఊహించని గెస్ట్.. అన్ స్టాపబుల్‌లో రచ్చ డబుల్
Unstoppable
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 13, 2022 | 7:56 PM

ఇండియాలో టాక్ షోలనింటిలో బాప్ ఏది అంటే బాలయ్య అన్ స్టాపబుల్ అని అన్ డౌటేడ్ గా చెప్పొచ్చు. నటసింహం నందమూరి బాలాకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో టెలికాస్ట్ అవుతున్న విషయం తెలిసిందే. మొదటిసారి బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో గురించి ఎంత చెప్పిన తక్కువే.. బాలకృష్ణలో మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ టాక్ షో. మొదటి సీజన్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు అంతకు మించిన ఎనర్జీతో సీజన్ 2ను నడిపిస్తున్నారు బాలకృష్ణ. సీజన్ 2లో యంగ్ హీరోలతో తనదైన శైలిలో పంచ్ లు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ సారి సీజన్ 2లో మొదటి గెస్ట్ గా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరైన విషయం తెలిసిందే.. ఆ తర్వాత యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ హాజరయ్యారు.

ఆ తర్వాత మరో ఇద్దరు కుర్ర హీరోలు.. శర్వానంద్, అడవి శేష్ హాజరయ్యారు..ఈ కుర్ర హీరోలను ఓ రేంజ్ లో ఆడుకున్నారు బాలయ్య. తనదైన డైలాగ్స్‌తో.. పంచ్‌లతో తికమక పెట్టారు. ఇక ఇప్పుడు నాలుగో ఎపిసోడ్ కు రెడీ అవుతున్నారు. ఈ ఎపిసోడ్ కు గెస్ట్ గా ఎవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో మరో రాజకీయ ప్రముఖుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గెస్ట్ గా హాజరవనున్నారని తెలుస్తోంది. బాలయ్యకు, కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.ఈ ఇద్దరు కలిసి ఒకే స్కూల్ లో చదువుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరూ మంచి మిత్రులు. ఇక ఈ ఎపిసోడ్ లో బాలయ్య.. కిరణ్ కుమార్ రెడ్డి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు.? ఎలా ఆటపట్టిస్తారు.? అన్నది చూడాలి.

ఇవి కూడా చదవండి
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం