Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 6 Telugu: ఇనయ, శ్రీసత్య మధ్య బిగ్ ఫైట్.. ఇంటి కెప్టెన్‏గా నిలిచింది ఆమెనే..

ఆదిరెడ్డిని వెన్నుపోటు పొడిచింది గీతూ. తన మాటలతో ఆదిరెడ్డిని మోసం చేసింది. దీంతో ఆమెపై కోపంతో మైక్ నెలకేసి కొట్టాడు ఆదిరెడ్డి. ఇక అతను చేసిన చిన్నపొరపాటుతో గేమ్ నుంచి డిస్ క్వాలిఫై అయ్యాడు

Bigg Boss 6 Telugu: ఇనయ, శ్రీసత్య మధ్య బిగ్ ఫైట్.. ఇంటి కెప్టెన్‏గా నిలిచింది ఆమెనే..
Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 05, 2022 | 11:08 AM

నేను కేవలం డబ్బు కోసమే వచ్చాను.. ఇంట్రెస్ట్ ఉంటేనే గేమ్ ఆడతాను అంటూ మొదటి నుంచి చెప్పుకుంటున్న వస్తున్న శ్రీసత్య ఎట్టకేలకు బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ అయ్యింది. రసవత్తంగా సాగిన బెలూన్ల టాస్కులో చివరి వరకు తన బెలూన్ కాపాడుకోవడంలో సక్సెస్ అయ్యింది. అయితే కెప్టెన్ అయ్యేందుకు ఇనయను… గీతూ టార్గెట్ చేసి మరీ ఓడించింది. దీంతో ఇంటి కెప్టెన్‏గా శ్రీసత్య కావడంతో ఆమె సంతోషానికి అవధులు లేవు. ఇక బెలూన్ టాస్కులో గెలవకపోవడంతో ఫైమా, గీతూ, మెరీనా, వాసంతి బాధపడ్డారు. అయితే శుక్రవారం ఎపిసోడ్ లో ఆదిరెడ్డిని వెన్నుపోటు పొడిచింది గీతూ. తన మాటలతో ఆదిరెడ్డిని మోసం చేసింది. దీంతో ఆమెపై కోపంతో మైక్ నెలకేసి కొట్టాడు ఆదిరెడ్డి. ఇక అతను చేసిన చిన్నపొరపాటుతో గేమ్ నుంచి డిస్ క్వాలిఫై అయ్యాడు. శుక్రవారం నాటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందామా.

రాత్రిళ్లు టీషర్స్ కొట్టేయకూడదు అని ఆదిరెడ్డితో గీతూ డీల్ కుదుర్చుకుంది. కానీ అప్పటికే ప్లాన్ చేసిన గీతూ.. అతడిని మాటల్లో పెట్టి టీషర్ట్ కొట్టేసింది. ఇక గీతూ చేసిన మోసాన్ని తెలుసుకున్న ఆదిరెడ్డి.. కోపంతో తన టీషర్ట్ నెలకేసి కొట్టాడు. టీషర్ట్‏తోపాటు అతను ధరించిన మైక్ కూడా నెలపై పడిపోయింది. నాతో పర్సనల్ గా గేమ్ ఆడావు అంటూ ఆది ఫైర్ కాగా.. భుజ బలం కాదు.. బుద్ధిబలం వాడానంటూ అడ్డంగా వాదించింది. ఆదిరెడ్డి ఎంత అరిచినా నేను చేసింది రైట్ అంటూ వాదనకు దిగింది. దీంతో ఆదిరెడ్డి గేమ్ ఆడేందుకు ఆసక్తి చూపించలేదు. ఇక రంగంలోకి దిగిన బిగ్ బాస్.. చనిపోయిన వ్యక్తి టీషర్ట్స్ దొంగించలేడని చెప్పి గీతూకు షాకిచ్చాడు. ఇక మైక్ నెలపై పడేసినందుకు ఆదిరెడ్డి డిస్ క్వాలిఫై అంటూ తేల్చీ చెప్పాడు బిగ్ బాస్.

ఆ తర్వాత ఇనయ, రేవంత్ మధ్య ఫిజికల్ వార్ జరిగింది. గేమ్ గేమ్ లా కాకుండా రాక్షసుల్లా మారిపోయి మరీ కొట్టుకున్నారు. ముఖ్యంగా రేవంత్, ఇనయ మధ్య పెనుగులాట తీవ్రస్థాయిలో నడిచింది. దీంతో ఇంటెన్షల్ గా కొడుతున్నారని ఇనయ అరిచి గోల చేసిన ఎవరు పట్టించుకోలేదు. ఇక ఈ తర్వాత మిషన్ పాజిబుల్ టాస్క్ డ్రా కాగా.. ఇరువురి టీమ్స్ నుంచి కెప్టెన్సీ కోసం పోటీపడే కంటెస్టెంట్స్ పేర్లు చెప్పమన్నారు. దీంతో శ్రీసత్య, ఇనయ, మెరీనా, ఫైమా, వాసంతి, గీతూ బెలూన్ టాస్కులో పోటిపడ్డారు. ఇందులో మిగతా వారు బెలూన్స్ కాపాడుకోలేకాపోయారు. ఇక చివరగా శ్రీసత్య, ఇనయ మిగలగా.. ఇనయను టార్గెట్ చేసి మరీ బెలూన్ పగలగొట్టింది గీతూ. దీంతో శ్రీసత్య ఇంటి కెప్టెన్ అయ్యింది.