Jabardasth: జబర్దస్త్ వేదికపై నయా యాంకర్.. రష్మీ స్థానంలోకి వచ్చిన కొత్త బ్యూటీ ఎవరంటే..

తాజాగా యాంకర్ రష్మీకి జబర్దస్త్ షో నిర్వాహకులు షాకిచ్చినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే.. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో... యాంకర్ స్థానంలో రష్మీకి బదులుగా మరో కొత్త బ్యూటీ కనిపించింది.

Jabardasth: జబర్దస్త్ వేదికపై నయా యాంకర్.. రష్మీ స్థానంలోకి వచ్చిన కొత్త బ్యూటీ ఎవరంటే..
Rashmi
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 05, 2022 | 10:46 AM

బుల్లితెరపై స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. గ్లామర్‏గా కనిపిస్తూ ఆడియన్స్‏ను అలరిస్తూ.. తెలుగు ప్రేక్షకులకు చేరువైంది రష్మీ. జబర్దస్త్ కామెడీ షో ద్వారా కావాల్సినంత పాపులారిటీని సంపాదించుకుంది. ఇటీవల కొద్దిరోజులుగా కేవలం జబర్దస్త్ షో మాత్రమే కాకుండా ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు తనే హోస్ట్‏గా వ్యవహరిస్తూ బిజీ అయిపోయింది. ఓవైపు యాంకరింగ్‏తో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది రష్మీ. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. ఇందులో యంగ్ హీరో నందు కథానాయికుడిగా కనిపించారు. ఈ సినిమా నవంబర్ 4న విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది. అయితే తాజాగా యాంకర్ రష్మీకి జబర్దస్త్ షో నిర్వాహకులు షాకిచ్చినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే.. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో… యాంకర్ స్థానంలో రష్మీకి బదులుగా మరో కొత్త బ్యూటీ కనిపించింది.

రష్మీ స్థానంలో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన ఆ బ్యూటీ ఎవరో కాదు.. సౌమ్య రావు. ఆమె అదే ఛానల్‏లో ప్రసారమయ్యే శ్రీమంతుడు సీరియల్ నటి. ఇప్పుడు జబర్దస్త్ వేదికపై సందడి చేయనున్నట్లు హోస్ట్ ఇంద్రజ పరిచయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో రిలీజ్ కాగా.. కొత్తగా వచ్చిన యాంకర్ పై హైపర్ ఆది తన స్టైల్లో పంచులు వేశారు. ఇక కృష్ణ భగవాన్, హైపర్ ఆది, ఆటో రాం ప్రసాద్ పంచులకు ఆమె ఇచ్చిన కౌంటర్స్ భలే ఫన్నీగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

సౌమ్య పూర్తి పేరు సౌమ్య శారద. కర్ణాటకలోని శివమొగ్గాలో పుట్టి పెరిగిన ఈమె.. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. బెంగుళూరులో స్టడీస్ పూర్తిచేసిన ఆమె.. ఓ కన్నడ న్యూస్ ఛానెల్లో యాంకర్‏గా చేరింది. యాక్టింగ్ పై ఉన్న ఆసక్తి కారణంగా ఆమె పలు సీరియల్స్‏లో నటించేందుకు ప్రయత్నించింది. అలా పత్తేదారి ప్రతిభ ధారవాహికతో బుల్లితెర ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఆమె కళ్లు చూస్తే విలన్ పాత్రలు గుర్తుకురావడంతో ఆమెకు ఎక్కువగా అలాంటి పాత్రలే వచ్చాయి. ఇక తెలుగులో శ్రీమంతుడు సీరియల్ చేసిన ఆమె.. ఇప్పుడు జబర్దస్త్ వేదికపై యాంకర్ గా ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యింది.

View this post on Instagram

A post shared by Sowmya Rao (@sowmya.sharada)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో