Sudigali Sudheer: జబర్దస్త్‏లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న సుధీర్.. ఫుల్ క్లారిటీతో రూమర్స్‏కు చెక్ పెట్టాడు..

సుధీర్ కొంతకాలంగా జబర్దస్త్ షోకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు కూడా దూరమయ్యాడు. అనుహ్యంగా స్టార్ మా ఛానెల్లో ప్రత్యేక్షమయ్యాడు. ఆ తర్వాత పలు ఛానల్లో యాంకర్‏గా సత్తా చాటుతున్నాడు.

Sudigali Sudheer: జబర్దస్త్‏లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న సుధీర్.. ఫుల్ క్లారిటీతో రూమర్స్‏కు చెక్ పెట్టాడు..
Sudigali Sudheer
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 05, 2022 | 11:26 AM

యూత్‏లో సుడిగాలి సుధీర్‏కు ఉండే క్రేజ్ గురించి తెలిసిన విషయమే. జబర్దస్త్ వేదికపై కమెడియన్‏గా అలరించే సుధీర్‏కు ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే ఉంటుంది. సుధీర్, రష్మీ జోడీకి యూత్‏లో యమ ఫాలోయింగ్ ఉంది. ఈ జంటకు ఎంతో మంది అభిమానులున్నారు. ఓవైపు బుల్లితెరపై అలరిస్తూనే మరోవైపు వెండితెరపై సందడి చేస్తున్నారు సుధీర్. పలు చిత్రాల్లో కమెడియన్, సహయ నటుడిగా కనిపిస్తూనే..మరోవైపు హీరోగానూ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు గాలోడు సినిమాతో మరోసారి బిగ్ స్క్రీన్ పై సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో పక్కా ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. అయితే సుధీర్ కొంతకాలంగా జబర్దస్త్ షోకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు కూడా దూరమయ్యాడు. అనుహ్యంగా స్టార్ మా ఛానెల్లో ప్రత్యేక్షమయ్యాడు. ఆ తర్వాత పలు ఛానల్లో యాంకర్‏గా సత్తా చాటుతున్నాడు.

ఇదిలా ఉంటే.. జబర్దస్త్ షోకు సుధీర్ కావడంతో అతని ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఈషోకు సుధీర్ దూరంకావడంతో అనేక రూమర్స్ నెట్టింట హల్చల్ చేశాయి.. సుధీర్ తిరిగి జబర్దస్త్ షోకు వస్తే బాగుంటుందని అతని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఇదే విషయాన్ని అనేకసార్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న సుధీర్.. తాను జబర్దస్త్ షోలోకి తిరిగి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటని యాంకర్ అడగ్గా.. జబర్దస్త్ షో అన్నాడు 2013 ఫిబ్రవరి 7న తన జీవితంలో టర్నింగ్ పాయింట్ అని చెప్పగా.. మరి ఎందుకు వదిలేశారు అని మళ్లీ అడిగారు సదరు యాంకర్. దీంతో.. తాను షో వదిలేయలేదని.. మళ్లీ వెళ్ళనున్నట్లు తెలిపాడు. జబర్దస్త్ షోను నేను విడిచి పెట్టలేదు. ఒక 6 నెలలు బ్రేక్ తీసకున్నాను. కొన్ని ఆర్థిక సమస్యల కారణంగానే నేను గ్యాప్ తీసుకున్నాను. ఇదే విషయాన్ని నిర్మాతలకు కూడా చెప్పాను. వారు ఓకే అన్నారు. అతి త్వరలోనే మళ్లీ జబర్దస్త్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాను. అంటూ చెప్పుకొచ్చారు సుధీర్. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో