Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Geetu Royal: బంపర్ ఆఫర్ కొట్టేసిన గలాటా గీతూ.. పుష్ప 2లో ఛాన్స్.. కానీ

తాజాగా మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ కు బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఏకంగా పాన్ ఇండియా మూవీ పుష్ప 2 సినిమాలో ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది.

Geetu Royal: బంపర్ ఆఫర్ కొట్టేసిన గలాటా గీతూ.. పుష్ప 2లో ఛాన్స్.. కానీ
Galatta Geetu
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 13, 2022 | 7:30 PM

బిగ్ బాస్ తెలుగు గేమ్ షో ద్వారా చాలా మంది సినిమా ఛాన్స్ లు అందుకున్న విషయం తెలిసిందే. ఫెడ్ అవుట్ అవుతున్న టైం లో బిగ్ బాస్ గేమ్ షోకు వెళ్తే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చు.. తద్వారా సినిమాల్లో తిరిగి రాణించవచ్చు అని చాలా మంది అనుకుంటారు. కొంతమందికి అలా ఛాన్స్ కు కూడా వచ్చాయి. తాజాగా మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ కు బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఏకంగా పాన్ ఇండియా మూవీ పుష్ప 2 సినిమాలో ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది. ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరో కాదు.. గలాటా గీతూ

చిత్తూరు చిరుత అంటూ అక్కడి యాసతో మాట్లాడుతూ ఈ అమ్మడు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. నేను ఇలానే ఉంటా.. నాకు నచ్చినట్టే ఆడుతా అంటూ బిగ్ బాస్ హౌస్ లో గీతూ చేసిన రచ్చ మామూలు రచ్చ కాదు. అందరిదీ ఒకదారి అయితే నాది మరోదారి అంటూ చిత్ర విచిత్రంగా ప్రవర్తించిన గీతూ టాప్ 5లో ఉంటుందని అనుకుంటే ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యి బోరుమని ఏడ్చింది .

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత డిప్రషన్ లోకి వెళ్లానని తెలిపింది. తాజాగా  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు పలు సినిమాల్లో ఛాన్స్ లు వస్తున్నాయని తెలిపింది. అయితే పీ ఆర్ టీమ్ లేకుండా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం వల్లే త్వరగా బయటకు వచ్చేశానని చెప్పుకొచ్చింది. అలాగే బిగ్ బాస్  విన్నర్ అయ్యే ఛాన్స్ ఆదిరెడ్డి, రేవంత్ కు మాత్రమే ఉందని చెప్పుకొచ్చింది. ఇక పుష్ప 2 సినిమాలో ఛాన్స్ దక్కిందన్న వార్త పై స్పందిస్తూ.. ఇప్పటివరకు ఎవరు నన్ను సంప్రదించలేదని కాకపోతే పుష్ప కో డైరెక్టర్ నా ఫోన్ నెంబర్ తీసుకున్నారనీ తెలిపింది. అలాగే రాజకీయాలంటే తనకు ఇష్టమని భవిషత్తులో రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన ఉందని తెలిపింది గీతూ..

ఇవి కూడా చదవండి
ఇక పదేళ్ల పిల్లలు కూడా బ్యాంకు ఖాతా తీయవచ్చు..ఆర్బీఐ కీలక నిర్ణయం
ఇక పదేళ్ల పిల్లలు కూడా బ్యాంకు ఖాతా తీయవచ్చు..ఆర్బీఐ కీలక నిర్ణయం
తల్లిదండ్రులైన హీరో విష్ణు విశాల్, గుత్తా జ్వాల.. 
తల్లిదండ్రులైన హీరో విష్ణు విశాల్, గుత్తా జ్వాల.. 
దేవుడు పిలుస్తున్నాడు.. నేను వెళుతున్నానంటూ చెప్పాడు.. చివరకు..
దేవుడు పిలుస్తున్నాడు.. నేను వెళుతున్నానంటూ చెప్పాడు.. చివరకు..
ఈ పండు రోజుకొకటి తింటే చాలు.. మీ గుండెకు శ్రీరామ రక్ష..!!
ఈ పండు రోజుకొకటి తింటే చాలు.. మీ గుండెకు శ్రీరామ రక్ష..!!
కేఎల్ రాహుల్ వర్సెస్ సంజీవ్ గోయెంకా.. అందరిచూపు ఈ ఇద్దరిపైనే..
కేఎల్ రాహుల్ వర్సెస్ సంజీవ్ గోయెంకా.. అందరిచూపు ఈ ఇద్దరిపైనే..
సమ్మర్ గ్రీన్ వేవ్.. ఇంట్లో మొక్కల అద్దె ట్రెండ్
సమ్మర్ గ్రీన్ వేవ్.. ఇంట్లో మొక్కల అద్దె ట్రెండ్
అయోధ్య రామాలయంలో భక్తుల ప్రదక్షిణ కోసం సొరంగం నిర్మాణం..
అయోధ్య రామాలయంలో భక్తుల ప్రదక్షిణ కోసం సొరంగం నిర్మాణం..
ఇంటర్‌ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా టాప్.. రేపట్నుంచి రీ-వెరిఫికేషన్!
ఇంటర్‌ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా టాప్.. రేపట్నుంచి రీ-వెరిఫికేషన్!
కూల్ గా ఉండాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా దోసకాయని తినాల్సిందే
కూల్ గా ఉండాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా దోసకాయని తినాల్సిందే
రోజూ వాకింగ్‌కి వెళ్తున్నారా..? ఇలా నడిస్తేనే ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ వాకింగ్‌కి వెళ్తున్నారా..? ఇలా నడిస్తేనే ఆరోగ్య ప్రయోజనాలు..