Cancer: పొగాకు మానేయడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని ఎంత వరకు తగ్గించవచ్చు..? నోటి క్యాన్సర్ సంకేతాలేంటీ..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Nov 14, 2022 | 6:29 AM

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అధిక మరణాలకు ప్రధాన కారణం క్యాన్సర్.. 2020లో దాదాపు 10 మిలియన్ల మరణాలకు క్యాన్సర్ కారణమైందని నివేదికలు పేర్కొంటున్నాయి.

Cancer: పొగాకు మానేయడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని ఎంత వరకు తగ్గించవచ్చు..? నోటి క్యాన్సర్ సంకేతాలేంటీ..
Smoking

Cancer Symptoms: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అధిక మరణాలకు ప్రధాన కారణం క్యాన్సర్.. 2020లో దాదాపు 10 మిలియన్ల మరణాలకు క్యాన్సర్ కారణమైందని నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 45 లక్షల మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. దేశంలో దాదాపు 40 నుండి 50 శాతం క్యాన్సర్ కేసులు చికిత్సకు సవాలుగా మారుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఇలాంటి సందర్భంలో మరణాల రేటు ఎక్కువగా నమోదవుతుందని చెబుతున్నారు. ఈ వ్యాధి చికిత్స సమయంలో రోగి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుందని పేర్కొంటున్నారు.

ఫరీదాబాద్‌లోని సర్వోదయ హాస్పిటల్‌లోని సర్వోదయ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డా. దినేష్ పెంధార్కర్ మాట్లాడుతూ.. భారత ఆరోగ్య వ్యవస్థ క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. “భారతీయ వైద్యులు ఎన్నో మైలు రాళ్లను అధిగమించారన్నారు. చాలా కాలంగా రోగులు ఇన్ఫెక్షన్ సమస్యతో పోరాడుతున్నారు. లక్షణాలను చూసిన తర్వాత కూడా, క్యాన్సర్ వచ్చే అవకాశం లేకపోలేదు.. క్యాన్సర్ కోసం పరీక్షించడం కంటే సంక్రమణకు చికిత్స చేయడం వారి మొదటి ప్రతిస్పందనగా ఉంది.. కాబట్టి వైద్యులు కూడా క్యాన్సర్ వివిధ లక్షణాల గురించి తెలుసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.

భారతదేశంలోని మొత్తం కేసులలో 40% నోటి క్యాన్సర్..

Tv9తో మాట్లాడుతూ పెంధార్కర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. “వయస్సుతోపాటు క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. 50 ఏళ్లు పైబడిన వారు ముఖ్యంగా క్యాన్సర్ లక్షణాలు.. వారితో సంబంధం ఉన్న అసాధారణ ఆరోగ్య సమస్యల గురించి అప్రమత్తంగా ఉండాలి’’ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

పెంధార్కర్ ప్రకారం.. భారతదేశంలో క్యాన్సర్‌కు నాలుగు ప్రధాన కారణాలు పొగాకు, ఆల్కహాల్, ఊబకాయం, HPV (హ్యూమన్ పాపిల్లోమావైరస్), హెపటైటిస్‌తో సహా వైరల్ ఇన్‌ఫెక్షన్లు. ప్రారంభ రోగనిర్ధారణ ద్వారా క్యాన్సర్ కు విజయవంతమైన చికిత్స సాధ్యమవుతుంది. అయితే ఇది దాని ప్రారంభ సంకేతాలు, లక్షణాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు.

భారతదేశంలోని మొత్తం క్యాన్సర్ కేసులలో 40 శాతం ఓరల్ క్యాన్సర్‌కు కారణమని ఆయన అన్నారు. పొగాకును నమలడం, ధూమపానం చేయడం లేదా జర్దా తినడం.. ఇలా వివిధ రూపాల్లో పొగాకును ఉపయోగించడం దీనికి ప్రధాన కారణం. జీవితం నుంచి పొగాకును తొలగించడం ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని 40 శాతం తగ్గించవచ్చు.

నోటి క్యాన్సర్ ప్రారంభ సంకేతాలు – లక్షణాలు..

నోటి క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడం కొంచెం సులభం అని పెంధార్కర్ చెప్పారు. ఎందుకంటే ఇది సాధారణంగా నోటిలో ఉంటుంది.. కంటితో కనిపిస్తుంది. పొగాకు నమిలే వారికి క్యాన్సర్ సంకేతాలను ముందుగా గుర్తించేందుకు వారి నోటిని క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలని సూచించారు.

నోటి పుండ్లు, చిగుళ్లు వాపు, పళ్లు తోముకునేటప్పుడు నోటి నుంచి రక్తం కారడం, మెడ భాగంలో వాపు, నొప్పి వంటివి క్యాన్సర్‌కు ముందస్తు సంకేతాలని పెంధార్కర్ చెప్పారు. అటువంటి సందర్భాలలో మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. క్యాన్సర్ అనుమానం ఉంటే.. డాక్టర్ దాని కోసం కణజాల బయాప్సీ చేస్తారు.

పొగాకు నమిలేవారికి నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చాలా ఆలస్యంగా నిర్ధారణ అయినట్లయితే, రోగికి సంవత్సరాల తరబడి ఖరీదైన చికిత్స చేసినప్పటికీ నెమ్మదిగా, బాధాకరమైన మరణాన్ని పొందవలసి ఉంటుందని డాక్టర్ పేర్కొన్నారు. పొగాకు వినియోగాన్ని నియంత్రించడం, క్యాన్సర్ హెచ్చరిక సంకేతాలను తెలుసుకోవడం ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి ఏకైక మార్గం అని ఆయన చెప్పారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu