Telangana: కులాలు వేరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. 3 నెలల తర్వాత కత్తులు, గొడ్డళ్లతో వచ్చి..

ఆరేళ్ల క్రితం ఇద్దరి మనసులు కలిశాయి.. వారి ప్రేమ విషయం ఇంట్లో చెప్పారు.. కులాలు వేరు కావడంతో యువతి తల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు. ఇద్దరూ మేజర్ కావడంతో మూడు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. కానీ..

Telangana: కులాలు వేరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. 3 నెలల తర్వాత కత్తులు, గొడ్డళ్లతో వచ్చి..
Jagtial District
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 14, 2022 | 6:05 AM

ఆరేళ్ల క్రితం ఇద్దరి మనసులు కలిశాయి.. వారి ప్రేమ విషయం ఇంట్లో చెప్పారు.. కులాలు వేరు కావడంతో యువతి తల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు. ఇద్దరూ మేజర్ కావడంతో మూడు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. కానీ.. అమ్మాయి తరుపు బంధువులకు మాత్రం వారు ఒక్కటవ్వడం అస్సలు నచ్చలేదు.. కత్తులు, గొడ్డళ్లతో రెండు వాహనాల్లో యువకుడి ఇంటికి చేరుకున్నారు. యువకుడి కుటుంబసభ్యులను బెదిరించి సినీ ఫక్కీలో యువతిని బలవంతంగా తీసుకెళ్లారు. ఈ షాకింగ్ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది.

జగిత్యాల రూరల్ మండలం బాలపల్లికి చెందిన జక్కుల మధు, రాయికల్‌ మండలం ఇటిక్యాలకు చెందిన ఓ యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి.. యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. యువతి మేజర్‌ కావడంతో 3 నెలల క్రితం ఆమె తల్లిదండ్రులకు తెలియకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. అనతంరం ప్రేమించిన యువకుడు, ఆమె కలిసి వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి యువతి మధుతోనే అత్తారింట్లో ఉంటోంది.

ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం యువతి కుటుంబ సభ్యులు, బంధువులు రెండు వాహనాల్లో బాలపల్లిలోని మధు ఇంటికి చేరుకున్నారు. కత్తులు, గొడ్డళ్లతో దిగి ఒక్కసారిగా దాడికి యత్నించారు. యువతిని బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. దీంతో బాధితుడు మధు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధు ఫిర్యాదు మేరకు యువతి తండ్రితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు జగిత్యాల రూరల్‌ పోలీసులు వెల్లడించారు. మరణాయుధాలతో వచ్చి తమని బెదిరించినట్లు యువకుడు తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..