AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yadadri Temple: యాదాద్రి పుణ్యక్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. చరిత్రలో మొదటిసారి రికార్డు స్థాయి ఆదాయం.. ఎంతంటే..?

యాదాద్రి ఆలయానికి రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. ఆదివారం ఒక్కరోజే ఒక కోటి 9 లక్షల ఆదాయం వచ్చినట్లు చెప్పారు ఆలయ అధికారులు. యాదాద్రి చరిత్రలోనే తొలిసారి కోటి రూపాలయ ఆదాయం రావడం ఇదే తొలిసారి కావడం విశేషమని చెప్పారు అధికారులు.

Yadadri Temple: యాదాద్రి పుణ్యక్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. చరిత్రలో మొదటిసారి రికార్డు స్థాయి ఆదాయం.. ఎంతంటే..?
Yadadri Temple
Shaik Madar Saheb
|

Updated on: Nov 14, 2022 | 5:00 AM

Share

యాదాద్రి ఆలయానికి రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. ఆదివారం ఒక్కరోజే ఒక కోటి 9 లక్షల ఆదాయం వచ్చినట్లు చెప్పారు ఆలయ అధికారులు. యాదాద్రి చరిత్రలోనే తొలిసారి కోటి రూపాలయ ఆదాయం రావడం ఇదే తొలిసారి కావడం విశేషమని చెప్పారు అధికారులు. వరుస సెలవులు, కార్తీక మాసం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున వచ్చిన మొక్కులు చెల్లించుకున్నారని.. ఇదే క్రమంలో స్వామివారి హుండీ ఆదాయం పెరిగిందని ఆలయ అధికారులు తెలిపారు. ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.1,09,82,000 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. ఆదివారం యాదాద్రి లక్ష్మినరసింహస్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. కొండ కింద నుంచి కొండపై వరకు భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి ఉచిత దర్శనానికి దాదాపు 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటల సమయం పట్టింది. బ్రేక్ దర్శనానికి సైతం భక్తులు అధిక సంఖ్యలో వెళ్లారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. లడ్డు ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కల్యాణ కట్ట ప్రాంతాల్లో భక్తుల సందడి నెలకొంది.

కార్తీక మాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించుకుని దీపారాధన చేసుకున్నారు. కొండ కింద నుండి ఆర్టీసీ బస్సులు లేక కొందరు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాలినడకన కొండపైకి వెళ్లి.. స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు కొండపైకి కారులో వెళ్లిన భక్తులు కూడా ఇబ్బందులు పడ్డారు.

తమ కార్లను పార్కింగ్ చేసేందుకు తగినంత స్థలం లేకపోవడంతో గంటల తరబడి వేచి ఉన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయడంలో అధికారులు వైఫల్యం చెందారంటూ భక్తులు ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!