Andhra Pradesh: ఇద్దరబ్బాయిలు.. ముగ్గురమ్మాయిలు.. తిరుపతి టు ఆగ్రా.. విద్యార్థుల మిస్సింగ్ కేసులో పురోగతి..

తిరుపతి నెహ్రూనగర్‌లో ఐదుగురు విద్యార్థుల మిస్సింగ్‌ మిస్టరీ వీడింది. ఈ నెల 10న అన్నమయ్య హై స్కూల్ చదువుతున్న విద్యార్థుల మిస్సింగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు.

Andhra Pradesh: ఇద్దరబ్బాయిలు.. ముగ్గురమ్మాయిలు.. తిరుపతి టు ఆగ్రా.. విద్యార్థుల మిస్సింగ్ కేసులో పురోగతి..
Tirupati Students Missing
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 14, 2022 | 6:10 AM

Tirupati Students Missing Case: తిరుపతి నెహ్రూనగర్‌లో ఐదుగురు విద్యార్థుల మిస్సింగ్‌ మిస్టరీ వీడింది. ఈ నెల 10న అన్నమయ్య హై స్కూల్ చదువుతున్న విద్యార్థుల మిస్సింగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అన్నమయ్య హైస్కూల్ స్టూడెంట్స్ ఆగ్రాలో ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు అబ్బాయిలుతో కలిసి వెళ్లిన ముగ్గురు అమ్మాయిలు క్షేమంగా ఉన్నట్లు గుర్తించారు. స్టూడెంట్స్ మిస్సింగ్ కేసును ఛాలెంజ్‌గా తీసుకొని వారి సోషల్ మీడియా అకౌంట్స్‌ను ఆరా తీశారు. సీడీఆర్ డీటైల్స్, ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్ ద్వారా అదృశ్యమైన విద్యార్థుల ఆచూకీని కనుగొన్నట్లు పోలీసులు చెప్పారు. ఐదుగురిని సేఫ్‌గా తీసుకొచ్చేందుకు తిరుపతి వెస్ట్ పోలీసులు ఆగ్రాకు బయలుదేరి వెళ్లారు.

వీరంతా అన్నమయ్య పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. ఈనెల 10న ఇంట్లోంచి స్కూల్‌కి వెళ్లిన ముగ్గురమ్మాయిలు, ఇద్దరబ్బాయిలు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కంగారుపడ్డ పేరెంట్స్‌ వాళ్ల ఫ్రెండ్స్‌, అయినవాళ్ల దగ్గర ఆరాతీశారు. ఫలితం లేకపోవడంతో చివరకు పోలీసుల్ని ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసారు. పేరెంట్స్ ఫిర్యాదు ను స్వీకరించిన పోలీసులు స్కూల్‌లో సీసీ ఫుటేజ్‌ తిరగేశారు. వేర్వేరు బృందాలుగా విడిపోయి గాలించారు.

మొబైల్‌ కూడా వాడకుండా చాలా తెలివిగా విద్యార్థులు వ్యవహారించడంతో అన్ని కోణాల్లో ఆరాతీశారు. చివరకు సోషల్ మీడియా అకౌంట్స్‌ను వెరిఫై చేశారు. ఇన్‌స్ట్రా గ్రామ్ ద్వారా చివరకు ఆగ్రాలో ఉన్నట్లు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వీలైనంత త్వరగా క్షేమంగా తీసుకొని వస్తామని పోలీసులు కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..