కాకరకాయతో డయాబెటిస్‌కు చెక్ పెట్టవచ్చా..? షుగర్ బాధితులు ఎలా తీసుకోవాలి.. నిపుణులు చెబుతున్నదేంటీ..?

ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహారం కారణంగా చాలామంది మధుమేహం బారిన పడుతున్నారని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు.

కాకరకాయతో డయాబెటిస్‌కు చెక్ పెట్టవచ్చా..? షుగర్ బాధితులు ఎలా తీసుకోవాలి.. నిపుణులు చెబుతున్నదేంటీ..?
Bitter Melon
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 13, 2022 | 6:38 AM

ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహారం కారణంగా చాలామంది మధుమేహం బారిన పడుతున్నారని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. మధుమేహం వ్యాధిని సకాలంలో నియంత్రించకపోతే.. ఇది క్రమంగా పెరిగి ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్తంలో పెరిగిన చక్కెర స్థాయిని తగ్గించడానికి ముఖ్యంగా తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించాలి. షుగర్ వ్యాధిని సహజంగా అదుపులో ఉంచుకోనేందుకు పలు కూరగాయలు, పండ్లను ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. అయితే, మధుమేహం ఉన్న వారు.. షుగర్ లెవల్ ను కంట్రోల్ లో ఉంచేందుకు కాకరకాయ లాంటివి తినడం మంచిది అని పలువురు పేర్కొంటుంటారు. నిజంగా.. కాకరకాయ తినడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చా..? అనే ప్రశ్న అందరికి తలెత్తుతుంటుంది. అది నిజమో, కాదో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. చేదు పదార్థాలు కఫా, పిత్త దోషాలను సమతుల్యం చేసే శక్తిని కలిగి ఉన్నాయి. అందువల్ల, ఇవి శరీరంలోని టాక్సిన్స్, కొవ్వును బయటకు పంపించడంలో సహాయపడతాయి. ఇది కాకుండా, చక్కెర కోరికలను కూడా చేదు ఆహారాలు తగ్గించడంలో మేలు చేస్తాయి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు చేదు పదార్థాలను తీసుకోవడం మంచిది.

చేదు ఆహారాలు రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. చేదు ఆహారాలలో పాలీపెప్టైడ్-P ఉంటుంది. ఇది ఇన్సులిన్‌కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఇది కాకుండా, చేదు ఆహారాలలో గెలాక్టోమన్నన్ అనే ఫైబర్ కూడా ఉంటుంది. ఇది కూడా రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తంలో అదనపు చక్కెరను శోషించకుండా నిరోధిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ చేదు ఆహారాలతో రక్తంలో చక్కెరను తగ్గించుకోవచ్చు..

కాకరకాయలో పాలీపెప్టైడ్-పి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా షుగర్ లెవల్స్ తగ్గించుకోవడానికి దీని రసాన్ని కూడా తయారు చేసుకుని తాగవచ్చు.

మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడే మరొక చేదు ఆహారం మెంతి గింజలు, కలోంజి. గెలాక్టోమన్నన్ అనే ఫైబర్ మెంతికూరలో ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర పెరగడానికి అనుమతించదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..