Low Blood Sugar: రక్తంలో చక్కెర తక్కువైనా ప్రాణానికి ప్రమాదమే.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వండి..

ప్రస్తుత కాలంలో డయాబెటిస్ సమస్య చాలామందిలో కనిపిస్తోంది. యువత నుంచి పెద్దవారి వరకూ మధుమేహం బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తీపి పదార్థాలు లేదా చక్కెరకు దూరంగా ఉండాలని వైద్యులు తరచుగా సలహా ఇస్తుంటారు.

Low Blood Sugar: రక్తంలో చక్కెర తక్కువైనా ప్రాణానికి ప్రమాదమే.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వండి..
Blood Sugar
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 13, 2022 | 6:22 AM

ప్రస్తుత కాలంలో డయాబెటిస్ సమస్య చాలామందిలో కనిపిస్తోంది. యువత నుంచి పెద్దవారి వరకూ మధుమేహం బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తీపి పదార్థాలు లేదా చక్కెరకు దూరంగా ఉండాలని వైద్యులు తరచుగా సలహా ఇస్తుంటారు. కానీ మన శరీరానికి చక్కెర కూడా చాలా ముఖ్యమైనదని నిపుణులు పేర్కొంటున్నారు. గ్లూకోజ్ సాధారణ స్థాయి డెసిమీటర్‌కు 80-110 mg మధ్య ఉండాలని పేర్కొంటున్నారు. మీ శరీరంలో చక్కెర స్థాయి డెసిమీటర్‌కు 72 మిల్లీగ్రాముల కంటే తక్కువగా ఉంటే.. రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని హైపోగ్లైసీమియా అంటారు. డయాబెటిక్ పేషెంట్లు షుగర్ స్థాయి పడిపోవడాన్ని గమనించలేరు. అయితే, మధుమేహం బాధితులకు శరీరంలో షుగర్‌ స్థాయి తక్కువగా ఉన్నా.. అనేక వ్యాధులు వస్తాయని పేర్కొంటున్నారు. కావున షుగర్ బాధితులకు రక్తంలో చక్కెర స్థాయి తగ్గడానికి కారణం ఏమిటీ..? ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

రక్తంలో చక్కెర తగ్గడానికి కారణాలు ఏమిటి?

రక్తంలో చక్కెరను గ్లూకోజ్ అని కూడా అంటారు. మనం ఏ ఆహారం తీసుకున్నా రక్తంలో గ్లూకోజ్ కరిగిపోతుంది. ఇక్కడ నుంచి అది శరీరంలోని కణాలకు వెళుతుంది. కణాలకు శక్తి కోసం గ్లూకోజ్‌ను ఉపయోగించడంలో సహాయపడుతుంది. కొన్ని కారణాల వల్ల ఆకలితో ఉన్న వ్యక్తులు లేదా సగటు కంటే తక్కువ ఆహారం తినే వ్యక్తులు తక్కువ రక్త చక్కెర బాధితులుగా మారవచ్చని పేర్కొంటున్నారు.

రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉంటే కనిపించే లక్షణాలు..

  • కంటిచూపు మసకగా కనిపించడం
  • వేగవంతమైన హృదయ స్పందన
  • తల తిరుగుతున్నట్లు అనిపించడం
  • చేతులు, కాళ్లలో వణుకు
  • ఆందోళన పెరగడం
  • చర్మం పసుపు రంగులోకి మారడం
  • తలనొప్పి – నిరసంగా ఉండటం
  • నిద్ర పట్టకపోవడం
  • ఆకలి పెరగడం

రక్తంలో చక్కెర తక్కువగా ఉంటే ఎలాంటి చికిత్స తీసుకోవాలి..

డయాబెటిక్ పేషెంట్ అయితే కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. గ్లూకోజ్.. చక్కెర కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్‌లో సమృద్ధిగా ఉంటుంది. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం ఆహారంలో కనీసం 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉండాలి. మీరు ఆహారంలో డ్రై ఫ్రూట్స్, జ్యూస్‌లు లేదా మాంసాహారం కూడా చేర్చుకోవాలి.

దీనిపై దృష్టి పెట్టండి..

మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు.. ముందుగా అల్పాహారం తీసుకున్న తర్వాత వెళ్లండి. మీకు కళ్లు తిరగడం అనిపిస్తే వెంటనే తీపి పదార్థాలు తినండి. మీ రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోండి. డాక్టర్ సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..