కోడిగుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా?

17 November 2026

TV9 Telugu

TV9 Telugu

కోడిగుడ్డు ప‌చ్చసొన (Egg Yolk) తినాలంటే చాలామంది భ‌య‌ప‌డుతుంటారు. ఎందుకంటే దాంట్లో కొవ్వుల శాతం ఎక్కువ‌గా ఉంటుంది

TV9 Telugu

అది తిన‌డంవ‌ల్ల ర‌క్తనాళాల్లో చెడు కొవ్వు పెరుగుతుంద‌ని ఆందోళన చెందుతారు. కొవ్వు పెరిగితే రక్తనాళాలు మూసుకుపోయి‌ గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌ని జంకుతుంటారు

TV9 Telugu

ఒంట్లో కొవ్వు పెరిగి స్థూలకాయం వంటి ఇత‌ర‌ అనారోగ్య స‌మ‌స్యల బారినప‌డే ప్రమాదం ఉంద‌ని మరికొంత మంది కోడిగుడ్డు ప‌చ్చసొనను ప‌క్కన పెడుతుంటారు

TV9 Telugu

కానీ అది ఒట్టి అపోహ మాత్రమేన‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి కోడిగుడ్డు పచ్చసొనతో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు

TV9 Telugu

కోడిగుడ్డు ప‌చ్చసొన‌ అధిక మొత్తంలో కొవ్వులు కలిగి ఉన్నప్పటికీ దాని ద్వారా రక్తంలో కొలెస్టరాల్‌ స్థాయిలు మాత్రం పెరుగవని హెల్త్‌ ఎక్స్‌పర్ట్స్‌ అంటున్నారు

TV9 Telugu

గుడ్డు పచ్చసొనను తినకపోవడం వల్ల ముఖ్య పోషకాలైన కొలైన్, సెలీనియం, జింక్‌తోపాటు విటమిన్ ఎ, బి, ఇ, డి, కె కూడా కోల్పోతారు

TV9 Telugu

బి కాంప్లెక్స్, విటమిన్ డి లకు ప్రధాన వనరుగా గుడ్డును పేర్కొంటారు. కోడిగుడ్డు పచ్చసొనలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది

TV9 Telugu

దాన్ని మన శరీరం సులువుగా గ్రహిస్తుంది. అదేవిధంగా గుడ్డులో ఉండే ల్యూటిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ కంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది