- Telugu News Photo Gallery Fruits for lungs to keep your lungs healthy include these 4 fruits in diet
Lungs Care: పెరుగుతున్న వాయు కాలుష్యం.. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తప్పనిసరిగా తినండి..
ప్రస్తుతకాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. మనం ఆరోగ్యంగా ఉండటంలో ఊపిరితిత్తులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అనారోగ్య ఊపిరితిత్తుల కారణంగా శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
Updated on: Nov 16, 2022 | 2:02 PM

ప్రస్తుతకాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. మనం ఆరోగ్యంగా ఉండటంలో ఊపిరితిత్తులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అనారోగ్య ఊపిరితిత్తుల కారణంగా శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే పలు రకాల పండ్లను ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

యాపిల్ : యాపిల్ పండులో విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఆపిల్ శరీరంలోని ఇతర వ్యాధులను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. మారుతున్న సీజన్‌లో యాపిల్ తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

దానిమ్మ : దానిమ్మ శరీరంలో రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ఊపిరితిత్తులకు సంబంధించిన అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి దూరంగా ఉంచడానికి దీనిలోని పోషకాలు పోరాడుతాయి. దీనిని తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తుల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి దానిమ్మపండును క్రమం తప్పకుండా తీసుకోండి..

బ్లూ బెర్రీస్ : బ్లూ బెర్రీస్‌లో ఆంథోసైనిన్స్ ఉంటాయి. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా రక్షించడానికి ఇది పనిచేస్తుంది. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి బ్లూ బెర్రీలను కూడా క్రమం తప్పకుండా తినవచ్చు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

నారింజ : నారింజలో విటమిన్ సి, విటమిన్ బి6 ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి పలు వ్యాధులతో పోరాడటానికి పనిచేస్తాయి. ఊపిరితిత్తులతోపాటు వాపు సమస్య నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది.




