మరో దారుణం.. ఇల్లాలిపై యాసిడ్‌ దాడి.. తీవ్ర గాయాలతో ఆస్సత్రిలో మహిళ వాంగ్మూలం

గాయపడిన గృహిణి సుస్మితా మల్లిక్‌ను హబ్రా ఆసుపత్రిలో చేర్చారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశారు.

మరో దారుణం.. ఇల్లాలిపై యాసిడ్‌ దాడి.. తీవ్ర గాయాలతో ఆస్సత్రిలో మహిళ వాంగ్మూలం
Crime
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 26, 2022 | 5:35 PM

మరో యాసిడ్ దాడిలో ఓ ఇల్లాలు తీవ్రంగా గాయపడింది. బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాలో వైవాహిక విభేదాల కారణంగా 36 ఏళ్ల భర్త తన భార్యపై యాసిడ్ పోశాడని ఆరోపించారు. ఈ ఘటనతో ఉత్తర 24 పరగణాస్‌లోని హబ్రా ప్రాంతంలోని అశోక్‌నగర్‌లో సంచలనం నెలకొంది. 36 ఏళ్ల వస్త్ర వ్యాపారి తన భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమెపై యాసిడ్‌ పోశాడు. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో అతడు చేసిన పనికి భార్య దారుణంగా గాయపడింది. తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికుల సాయంతో హబ్రా ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీస్ స్టేషన్ పోలీసులు దాడి చేసిన బట్టల వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం .. కొంకణ్‌, సుస్మిత మల్లిక్‌ దంపతులు గత ఆరు సంవత్సరాలుగా అశోక్‌నగర్‌లో నివసిస్తున్నారు. వీరిద్దరికి రెండున్నరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. తన భార్య సుస్మిత మరో వ్యక్తితో చనువుగా ఉంటుందని, అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని వ్యాపారి అనుమానించేవాడని చెప్పారు. అదే అనుమానం కారణంగా తరచూ దంపతుల మధ్య గొడవలు జరిగేవి. నవంబర్ 24 గురువారం ఉదయం సుస్మిత తన మొబైల్ ఫోన్‌లో ఏదో టైప్ చేస్తుండగా.. కొంకణ్‌కి మొబైల్ ఫోన్ చూడాలని అనుమానం వచ్చింది. ఫోన్ చూడడానికి సుస్మిత నిరాకరించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

ఉద్రిక్తత పెరగడంతో ఒక్కసారిగా కొంకణ్ ఇంట్లో నుంచి యాసిడ్ బాటిల్ తీసుకొచ్చి భార్యపై పోశాడు. అప్పటికే వారి గొడవ శబ్దం ఇరుగుపొరుగు వారికి వినిపించింది. ఒక్కసారిగా ఇంటిలోపల నుంచి ఏడుస్తూ బయటికి వచ్చింది గృహిణి. ఆమె అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు ఆమె శరీరంపై యాసిడ్ పోయడం గమనించారు. స్థానికులు వెంటనే ఆమెను రక్షించి హబ్రా స్టేట్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కారణంగా నార్త్ 24 పరగణాస్‌లోని అశోక్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణిక్‌నగర్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గాయపడిన గృహిణి సుస్మితా మల్లిక్‌ను హబ్రా ఆసుపత్రిలో చేర్చారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!