నాలుక ఆపరేషన్‌ కోసం వస్తే.. చిన్నారి జననాంగాలకు సర్జరీ చేసిన వైద్యులు..! తల్లిదండ్రుల ఆందోళన..

నోటిలో పెరుగుతున్న కణితిని తొలగించేందుకు ఏడాది వయసున్న కొడుకును ఆస్పత్రిలో చేర్చారు అజీత్‌ కుమార్‌. నోటికి శస్త్ర చికిత్స కాకుండా పిల్లవాడి జననాంగాలకు ఆపరేషన్ చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

నాలుక ఆపరేషన్‌ కోసం వస్తే.. చిన్నారి జననాంగాలకు సర్జరీ చేసిన వైద్యులు..! తల్లిదండ్రుల ఆందోళన..
New Born Baby
Follow us

|

Updated on: Nov 26, 2022 | 3:50 PM

ఓరల్ సర్జరీ కోసం తీసుకొచ్చిన పసిబిడ్డకు జననేంద్రియ శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. ఆపరేషన్‌ అనంతరం బిడ్డను వార్డ్‌కు షిఫ్ట్‌ చేసినప్పుడు విషయం తల్లిదండ్రులు గమనించారు. దాంతో వెంటనే ఈ విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకెళ్లగా సరైన సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారని బాధిత చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ షాకింగ్‌ ఘటన తమిళనాడులోని మధురై విరుదునగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన 25 ఏళ్ల అజిత్‌ కుమార్‌ అనే యువకుడు రోజువారీ కూలీగా జీవనంసాగిస్తున్నాడు. ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రి (జిఆర్‌హెచ్) వైద్యులు నోటికి బదులుగా తన కొడుకు పురుషాంగానికి ఆపరేషన్ చేశారని ఆరోపించారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం ఆరోపణలను GRH డీన్ డాక్టర్ ఎ రత్నవేల్ ఖండించారు.

నోటిలో పెరుగుతున్న కణితిని తొలగించేందుకు ఏడాది వయసున్న కొడుకును రాజాజీ ఆస్పత్రిలో చేర్చారు అజీత్‌ కుమార్‌. నోటికి శస్త్ర చికిత్స కాకుండా పిల్లవాడి జననాంగాలకు ఆపరేషన్ చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే ఆసుపత్రి వైద్యంలో ఎలాంటి వైఫల్యం లేదని రాజాజీ హాస్పిటల్ డీన్ డాక్టర్ ఎ రత్నవేల్ స్పందించారు.

నవంబర్ 21న సాతూరులోని అమీర్‌పాళయంకు చెందిన ఆర్‌ అజిత్‌కుమార్‌ రెండో కుమారుడు రాజాజీ ఆస్పత్రిలో చేరాడు. మరుసటి రోజు వైద్యులు చిన్నారికి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తర్వాత బిడ్డను వార్డుకు బదిలీ చేసినప్పుడు జననేంద్రియాలపై ఆపరేషన్ చేసినట్లు తల్లిదండ్రులు గమనించారు. ఈ విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకెళ్లగా సరైన సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారని అజిత్ కుమార్, కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ బిడ్డకు మరో చిన్నారికి చేయాల్సిన శస్త్రచికిత్స జరిగిందని అజిత్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. దీంతో కుటుంబ సభ్యులు రాజాజీ ఆస్పత్రి నిర్వాకంపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి

ఎదుగుదల వాయుమార్గానికి అడ్డుపడటంతో గతేడాది చిన్నారిని రాజాజీ ఆస్పత్రికి తరలించారు. నోటిలో ఎదుగుదలని తొలగించడం తప్ప మరో మార్గం లేని పరిస్థితిలో శిశువు ఉంది. గతేడాది నవంబర్‌ 2న చిన్నారికి శస్త్ర చికిత్స చేసి, ఆ తర్వాత ఇంటికి పంపినట్లు రాజాజీ ఆస్పత్రి డీన్‌ రత్నవేల్‌ చెబుతున్నారు. అయితే సర్జరీ అనంతరం చిన్నారి నాలుక నోటిలో ఇరుక్కుపోయింది. దాన్ని మార్చేందుకే చిన్నారిని సర్జరీ కోసం ఆస్పత్రిలో చేర్చినట్లు రత్నవేల్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం శస్త్రచికిత్సలో చిన్నారి మూత్రాశయంలో అసాధారణత కనిపించింది. పిల్లవాడికి మూత్రం పోయడానికి ట్యూబ్ పెట్టాల్సి వచ్చింది. ట్యూబ్ ఇన్సర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పురుషాంగం కొన చర్మం చాలా గట్టిగా ఉంది. దాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించి యూరినరీ ట్యూబ్‌ను అమర్చారు. పదే పదే అనస్థీషియా ఇవ్వకుండా ఉండేందుకు రెండు సర్జరీలు ఒకేసారి చేశామని ఆస్పత్రి డీన్ స్పందించారు. సర్జరీ తర్వాత చిన్నారి బాగా స్పందిస్తోందని రత్నవేల్ వివరించారు.

మరిన్ని  ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి