ఎమర్జెన్సీ లైట్‌ వెలుతురులో శిశువుకు గుండె ఆపరేషన్‌.. వైరలవుతున్న వీడియో సంచలనం

Jyothi Gadda

Jyothi Gadda |

Updated on: Nov 26, 2022 | 3:04 PM

ఆసుపత్రిలో వైద్యుల బృందం చీకట్లో ఎమర్జెన్సీ లైట్‌ వెలుతురులో ఓ శిశువుకు గుండె శస్త్రచికిత్స చేస్తున్న దృశ్యం ఒకటి వెలుగులోకి వచ్చింది. వైద్య సహాయకులు ఎమర్జెన్సీ లైట్‌ను పట్టుకుని ఉన్నారు. వైద్యులు ఆ వెలుతురులోనే శ్రమించి శస్త్రచికిత్స చేశారు.. రెండు గుండె కవాట మార్పిడి ఆపరేషన్లు చేశారు.

ఎమర్జెన్సీ లైట్‌ వెలుతురులో శిశువుకు గుండె ఆపరేషన్‌.. వైరలవుతున్న వీడియో సంచలనం
Emergency

అత్యవసర సేవల రంగంలో పనిచేసే వారు ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా తమ విధిని నిర్వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వైద్యులు వారి కళ్ల ముందు పడి ఉన్న రోగి జీవితం మాత్రమే వారి లక్ష్యంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం స్వచ్ఛందంగా ఈ రంగంలోకి వచ్చే వారిలో అత్యధికులు ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నవారే. యుద్ధం ప్రపంచంలోని అనేక ప్రాంతాలను నాశనం చేస్తున్నప్పటికీ, వైద్యులు మాత్రం అక్కడ కూడా ప్రజల జీవితాలను సురక్షితంగా ఉంచుకోవాలని చూస్తారు. ఉక్రెయిన్‌కి చెందిన ఓ వీడియో కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తోంది. రష్యా క్షిపణి దాడిని ఎదుర్కొంటున్న కీవ్‌లోని ఆసుపత్రిలో వైద్యుల బృందం చీకట్లో ఎమర్జెన్సీ లైట్‌ వెలుతురులో ఓ శిశువుకు గుండె శస్త్రచికిత్స చేస్తున్న దృశ్యం ఒకటి వెలుగులోకి వచ్చింది. వైద్య సహాయకులు ఎమర్జెన్సీ లైట్‌ను ఏర్పాటు చేశారు. వైద్యులు ఆ వెలుతురులోనే చాలా శ్రమించి శస్త్రచికిత్స చేశారు.. రెండు గుండె కవాట మార్పిడి ఆపరేషన్లు చేశారు. ఇదంతా ఓ డాక్టరే స్వయంగా ఇదంతా వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరుగుతోందని అందరికీ తెలుసు. ఇది ప్రతి ఒక్క వ్యవస్థపై ప్రభావితం చేసింది. అయితే, ఈ కష్ట సమయంలో కూడా వైద్యులు తమ బాధ్యతను చాలా చక్కగా నిర్వహించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని ఆసుపత్రిలో రష్యన్ క్షిపణుల కారణంగా నగర వ్యాప్తంగా విద్యుత్ స్తంభించిపోయింది. అయితే కరెంటు లేకపోయినప్పటికీ ఉక్రెయిన్ వైద్యులు ఓ చిన్నారికి గుండె శస్త్రచికిత్స చేస్తూనే ఉన్నారు. ఈ వీడియో చూశాక యుద్ధాన్ని ఎదుర్కొంటున్న ప్రజల పరిస్థితి ఏంటో అంచనా వేయొచ్చు. రెండు దేశాల మధ్య యుద్ధ ప్రభావం సైనికులపైనే కాదు ప్రతి వ్యక్తిపైనా పడుతుంది.

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి సమయంలో కీవ్‌లోని గుండె సర్జరీలు ఆగిపోయాయి. కానీ, చిన్నారికి అత్యవసర గుండె శస్త్రచికిత్స చేశారు. అని సోషల్ మీడియా వినియోగదారు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఎమర్జెన్సీ లైట్‌ మసక వెలుతురులో వైద్యుల బృందం ఆపరేషన్ చేయడాన్ని వీడియోలో చూడవచ్చు. ఆపరేషన్ టేబుల్‌పై చిన్నారి ఉందని సర్జరీ మధ్యలో కరెంటు పోయిందని వైద్యుల బృందం తెలిపింది. ఆపరేషన్‌లో రెండు గుండె కవాటాలను మార్చేందుకు కార్డియోపల్మోనరీ బైపాస్‌ను ఏర్పాటు చేసినట్టుగా వైద్య బృందంలోని ఒక డాక్టర్‌ తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు ఆ వైద్యులపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu