AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanitary Pad: శానిటరీ ప్యాడ్స్‌ వాడకంతో క్యాన్సర్‌ ముప్పు.. కొత్త అధ్యయనంలో షాకింగ్‌ వాస్తవాలు

అయితే శానిటరీ ప్యాడ్‌లకు సంబంధించి ఒక కొత్త అధ్యయనంలో నిజంగా భయానకర విషయం ఒకటి వెల్లడైంది. తాజా అధ్యయనం ప్రకారం, న్యాప్‌కిన్‌ల వాడకం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే..

Sanitary Pad: శానిటరీ ప్యాడ్స్‌ వాడకంతో క్యాన్సర్‌ ముప్పు.. కొత్త అధ్యయనంలో షాకింగ్‌ వాస్తవాలు
Sanitary Pads
Jyothi Gadda
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 23, 2022 | 7:07 AM

Share

శానిటరీ ప్యాడ్‌లకు సంబంధించి తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. అధ్యయనం ప్రకారం, శానిటరీ న్యాప్‌కిన్‌లను ఉపయోగించడం స్త్రీకి ప్రాణాంతకంగా మారుతుంది… అవును, అటువంటి రసాయనాన్ని శానిటరీ ప్యాడ్‌లలో వాడుతున్నారు. ఇది తీవ్రమైన వ్యాధి క్యాన్సర్‌ను కలిగించడమే కాకుండా స్త్రీని వంధ్యత్వానికి బలి చేస్తుందిని తాజా అధ్యయనం వెల్లడించింది. భారతదేశంలో కౌమారదశలో అడుగుపెట్టిన ప్రతి నలుగురిలో ముగ్గురు బాలికలు శానిటరీ ప్యాడ్‌లను ఉపయోగిస్తున్నారు. ఋతుస్రావం సమయంలో జననేంద్రియాలలో సంభవించే అనేక తీవ్రమైన వ్యాధులను నివారించడానికి శానిటరీ ప్యాడ్లను ఉపయోగిస్తారు. అయితే శానిటరీ ప్యాడ్‌లకు సంబంధించి ఒక కొత్త అధ్యయనంలో నిజంగా భయానకర విషయం ఒకటి వెల్లడైంది. తాజా అధ్యయనం ప్రకారం, న్యాప్‌కిన్‌ల వాడకం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే సంతానలేమి సమస్య కూడా రావచ్చు.

NGO టాక్సిక్స్ లింక్‌లో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, ఈ అధ్యయనంలో పాల్గొన్న డాక్టర్ అమిత్ ఈ విషయం గురించి మాట్లాడుతూ ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అని అన్నారు. ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని, ప్రతిచోటా సులభంగా లభించే శానిటరీ నాప్‌కిన్‌లలో ఇలాంటి అనేక రసాయనాలు ఉన్నాయని ఆయన చెప్పారు. శానిటరీ ఉత్పత్తులలో క్యాన్సర్ కారకాలు, పునరుత్పత్తి విషపదార్థాలు, ఎండోక్రైన్ డిస్‌రప్టర్లు మరియు అలర్జీలు వంటి అనేక తీవ్రమైన రసాయనాలు ఉన్నాయని డాక్టర్ అమిత్ చెప్పారు.

NGO టాక్సిక్స్ లింక్ నిర్వహించిన ఈ అధ్యయనం భారతదేశంలో విక్రయించే 10 బ్రాండ్ల శానిటరీ న్యాప్‌కిన్‌ల ఉత్పత్తులను కలిగి ఉన్న ఇంటర్నేషనల్ పొల్యూటెంట్ ఎలిమినేషన్ నెట్‌వర్క్ పరీక్షలో భాగం. అధ్యయనం సమయంలో పరిశోధకులు అన్ని నమూనాలలో థాలేట్స్, అస్థిర కర్బన సమ్మేళనాల (VOCలు) జాడలను కనుగొన్నారు. ఈ రెండు కలుషితాలు క్యాన్సర్ కణాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండటం ఆందోళన కలిగించే విషయం. 15-24 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో 64 శాతం మంది శానిటరీ ప్యాడ్‌లను ఉపయోగిస్తున్నారని తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న ఎన్జీవోకు చెందిన మరో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఆకాంక్ష మెహ్రోత్రా మాట్లాడుతూ.. శానిటరీ ప్యాడ్‌ల వాడకం వల్ల వ్యాధుల ముప్పు ఎక్కువ కావడం అత్యంత ఆందోళన కలిగిస్తున్న విషయంగా పేర్కొన్నారు. వాస్తవానికి ఈ తీవ్రమైన రసాయనాలు స్త్రీ చర్మంపై కంటే యోనిపై ఎక్కువ ప్రభావం చూపుతాయన్నారు. అటువంటి పరిస్థితిలో దీని కారణంగా ఈ ప్రమాదం మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

NGO టాక్సిక్స్ లింక్ చీఫ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రీతి బంతియా మహేష్ మాట్లాడుతూ… యూరోపియన్ ప్రాంతంలో వీటన్నింటికీ నియమాలు ఉన్నాయని చెప్పారు. కానీ, మన భారతదేశంలో పర్యవేక్షించబడే నిర్దిష్ట నియమాలు లేవని చెప్పారు. అయినప్పటికీ, ఇది ఖచ్చితంగా BIS ప్రమాణాల క్రింద వస్తుంది. కానీ దానిలో రసాయనాల గురించి ప్రత్యేకంగా ఎటువంటి నియమం లేదన్నారు.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తాజా సమాచారం ప్రకారం… 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న భారతీయ బాలికల్లో 64 శాతం మంది శానిటరీ న్యాప్‌కిన్‌లు వాడుతున్నారు. గత కొద్ది కాలంగా పెరుగుతున్న అవగాహన కారణంగా దాని ఉపయోగం కూడా పెరిగింది. IMARC గ్రూప్ ప్రకారం భారతదేశం శానిటరీ ఉత్పత్తులకు పెద్ద మార్కెట్. 2021 సంవత్సరంలోనే శానిటరీ నాప్‌కిన్‌ల టర్నోవర్ 618 మిలియన్ డాలర్లు. అలాగే, 2027 సంవత్సరం నాటికి ఈ మార్కెట్ 1.2 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.(Source)

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి