Sunny Leone: సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

Sunny Leone: సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

Anil kumar poka

|

Updated on: Dec 27, 2024 | 4:38 PM

వివాహిత మహిళల కోసం ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంలో ఓ షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న మహతారి వందన్ యోజన పథకం కింద ప్రముఖ నటి సన్నీ లియోన్‌ ప్రతి నెల రూ.1000 అందుకున్నారు. ఆమె అకౌంట్‌లోకి నేరుగా ఆ నగదు జమ అయ్యింది. ఇప్పుడీ విషయం ఆ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది.

పథకం నిధులు దారిమళ్లుతున్నాయని, అనర్హులకు కూడా లబ్ధి చేకూరుతోందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ.. మహిళా సాధికారత కోసం మహతారి వందన్ యోజన పేరుతో వారి ఖాతాల్లోకి నెలకు రూ.వెయ్యి బదిలీ చేస్తోంది. ఈ క్రమంలో వీరేంద్ర జోషి అనే వ్యక్తి సన్నీ లియోన్‌ పేరుతో అకౌంట్‌ తెరచినట్లు గుర్తించారు. బస్తర్‌ రీజన్‌లోని తూలూర్‌ చిరునామాతో బ్యాంక్‌ ఖాతా ఉందని, ఆమె భర్త పేరు జానీ సిన్స్‌గా పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. గత మార్చి నుంచి ప్రతి నెల రూ.1000 చొప్పున ఆ ఖాతాలో డిపాజిట్‌ అవుతున్నట్లు చెప్పారు. అయితే ఈ అకౌంట్‌ను సీజ్‌ చేయాలని బస్తర్‌ జిల్లా కలెక్టర్‌ హారిస్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.