చలికాలం అంటేనే నారింజ సీజన్. ఈ సమయంలో మార్కెట్ నిండా ఈ పండ్లు దర్శనమిస్తాయి. ఆరెంజ్ రంగులో కంటి ఇంపుగా కనిపంచే నారింజ రుచికి కూడా బలేగా ఉంటాయి
TV9 Telugu
కమలాపండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పొటాషియం, క్యాల్షియం, విటమిన్లు, ప్రొటీన్లు, పీచు ఉన్నందున ఇదెంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇందులోని సి-విటమిన్ రోగనిరోధకశక్తిని పెంచి సీజనల్ ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది
TV9 Telugu
ఎనీమియాతో బాధపడుతున్న వారు ఈ రసం తీసుకోవడం వల్ల సత్వర ఫలితం ఉంటుంది. వీటిలోని పీచు జీర్ణప్రక్రియకు దోహదం చేస్తే, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గాయాలను త్వరగా మాన్పుతాయి
TV9 Telugu
నారింజరసం తాగడం వల్ల కంటిచూపు మెరుగ్గా ఉంటుంది. చర్మం మృదువుగా, నిగారింపుతో ఉంటుంది. మధుమేహ రోగులు కూడా నారింజ పండ్లు భేషుగ్గా తినొచ్చు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి
TV9 Telugu
అయితే నారింజ పండేకాదు... దీని విత్తనాలు, తొక్కకూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. నారింజ గింజలు రుచికి చేదుగా ఉంటాయి. అందుకే వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని చాలా మంది అనుకుంటారు
TV9 Telugu
కానీ ఇది నిజంకాదు. నారింజ విత్తనాలు కూడా వివిధ పోషక లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. నారింజ గింజల్లో పాలిమైడ్, ఒలీక్, లినోనిక్ యాసిడ్స్ ఉంటాయి. అవి అలసటను తగ్గించడంలో సహాయపడతాయి
TV9 Telugu
కాబట్టి నారింజ గింజలు తినడం మంచిదే. అలాగే నారింజ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన కాలుష్య కారకాలను తొలగించడంలో సహాయపడతాయి
TV9 Telugu
నారింజ తొక్కల పౌడర్‌ను వేడి నీళ్లలో కలుపుకుని తాగితే త్వరగా బరువు తగ్గొచ్చు. నారింజ రసాన్ని మొటిమల మీద అప్లై చేస్తే తగ్గుముఖం పడతాయి. ఈ గింజలను ఎండబెట్టి పొడి చేసి నూనెలో కలిపి జుట్టుకు రాసుకుంటే చుండ్రు సమస్య తొలగిపోతుంది