AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Colon Cancer: పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి.? కారణం ఇదేనా.!

Colon Cancer: పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి.? కారణం ఇదేనా.!

Anil kumar poka
|

Updated on: Dec 27, 2024 | 6:40 PM

Share

ఇంతకుముందు క్యాన్సర్ అనగానే వయసు పైబడిన వాళ్లకే వస్తుందిలే అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిలోనూ క్యాన్సర్ లక్షణాలు గుర్తిస్తున్నామంటున్నారు డాక్టర్లు.అదే కోవలోకి వస్తుంది బోవెల్ క్యాన్సర్ లేదా కొలన్ క్యాన్సర్. దీన్నే పేగు క్యాన్సర్ అని కూడా అంటారు.సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వాళ్లలో కనిపించే పేగు క్యాన్సర్ కేసులు ఇప్పుడు యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ లాన్సెట్ విడుదల చేసిన తాజా నివేదిక చెబుతోంది.

కొలన్ క్యాన్సర్‌పై లాన్సెట్ సంస్థ తాజాగా 50 దేశాల్లో పరిశోధనలు జరిపింది. 27 దేశాల్లో 25 నుంచి 49 ఏళ్ల వయసు వారిలో పేగు క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని ఈ పరిశోధనలో వెల్లడైంది. కొలన్ క్యాన్సర్ కేసులు యువతలో ఎక్కువగా నమోదవుతున్న దేశాల్లో సంపన్న దేశాలే ఎక్కువగా ఉన్నాయని కూడా ఈ నివేదిక చెబుతోంది.ఆస్ట్రేలియా, జర్మనీ, ఐర్లాండ్, న్యూజీలాండ్, నార్వే, స్లొవేనియా, స్కాట్లాండ్, ఇజ్రాయెల్, కెనడా, ఫ్రాన్స్, అమెరికా, చిలీ, ఇంగ్లండ్, అర్జెంటీనా, పూర్టోరీకోలలో యువతలో కొలన్ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని, అలాగే తక్కువగా నమోదవుతున్న దేశాల్లో భారత్, యుగాండాలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది.భారత్‌లో తక్కువ కేసులు నమోదవుతున్నప్పటికీ గత రెండు దశాబ్దాలతో పోలిస్తే క్రమంగా పెరుగుతున్నాయని డాక్టర్లు అంటున్నారు గ్లోబోకాన్, జాతీయ క్యాన్సర్ ప్రోగ్రామ్ రిపోర్టు ప్రకారం.. 2000-2010 మధ్య ఏడాదికి 30,000 నుంచి 40,000 వరకు కొత్త కేసులు నమోదయ్యాయి. 2010-2020 మధ్య ఈ సంఖ్య 50 వేల నుంచి 60 వేలకు పెరిగింది. 2020 నుంచి 2022 మధ్య అంటే కేవలం రెండేళ్లలోనే 70,038 కొత్త కేసులు నమోదయ్యాయి.

మన పొట్ట భాగంలో చిన్న, పెద్ద పేగులుంటాయి. పెద్ద పేగు మన జీర్ణ వ్యవస్థలో కీలకమైన భాగం. మనం రోజూ తినే ఆహారం జీర్ణమయ్యాక, మలినాలు పెద్ద పేగు నుంచే బయటకు వెళ్తాయి.పెద్ద పేగు చివరి భాగాన్ని కొలన్ అంటారు. ఈ కొలన్ భాగంలో చిన్న చిన్న కణతులు లేదా గడ్డల్లాంటివి ఏర్పడతాయి. వాటినే వైద్య భాషలో పాలిప్స్ అంటారు.ఈ పాలిప్స్ కేన్సరస్ పాలిప్స్‌గా మారడానికి సుమారు 10 ఏళ్లు పడుతుంది.

దీనికి కారణాలేంటనే దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ కొన్ని అంశాలు మాత్రం బోవెల్ క్యాన్సర్‌కి కారణాలు కావచ్చని డాక్టర్లు పరిగణిస్తున్నారు.
సిగరెట్లు తాగడం.
ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం.
ఊబకాయం.
విపరీతమైన చిరుతిండ్లు
ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ మీట్, జంక్ ఫుడ్ అతిగా తీసుకోవడం
కడుపులో క్యాన్సర్‌ పాలిప్స్ ఉండటం
అనారోగ్యకరమైన జీవన విధానం
మహిళలతో పోలిస్తే పురుషులలోనే ఈ రకం క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పురుషుల్లో ఎక్కువగా కనిపించడానికి వారి జీవన విధానం కూడా ఓ కారణమని అంటున్నారు.

లక్షణాలు ఎలా ఉంటాయి?


పేగు క్యాన్సర్ ఉన్న వ్యక్తుల్లో కడుపులో ఎప్పుడూ ఇబ్బందిగా ఉంటుంది.
మలంలో రక్తం పడుతుంది, నలుపురంగులో కనిపిస్తుంది.
ఎక్కవసార్లు మలవిసర్జన చేయాల్సి రావచ్చు.
మల విసర్జన తర్వాత కూడా పొట్ట భారంగానే ఉన్నట్టు అనిపిస్తుంది.
విరేచనాలు లేదా మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి.
విరేచనంతో పాటు మ్యూకస్ అంటే జిగురు పడుతుంది.
పొట్ట కింద భాగంలో నొప్పిగా, ఇబ్బందిగా ఉంటుంది.
సరైన ఆహారం తీసుకున్నా బరువు తగ్గుతూ ఉంటారు.
ఎప్పుడూ నీరసంగా, అలసటగా ఉండటం, దేనిపై ఏకాగ్రత లేకపోవడం.
రోజువారీ జీవన విధానంలో మార్పులు చేసుకోవడం వలన మనం కొలన్ క్యాన్సర్ ముప్పును కొంతవరకు తగ్గించుకోవచ్చు.
అయితే పేగు క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం, క్యాన్సర్ స్క్రీనింగ్‌కు వెళ్లడం మంచిది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.