Viral: గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్..
ఒక్కోసారి ఊహించని సంఘటనలు ప్రాణం మీదికి తెస్తుంటాయి. లక్ బాగా లేకపోతే తాడే పామై కరుస్తుందని సామెత. ఇక్కడో యువకుడికి అదే జరిగింది. కాకపోతే కాసింతలో ప్రాణాలతో బయటపడ్డాడు. రిపేర్ చేసిన స్కూల్ బస్సు టైరులోకి గాలి నింపుతుండగా అది ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేపోయింది. దీంతో అక్కడున్న మెకానిక్ గాలిలోకి ఎగిరిపడ్డాడు. తలకు గాయమైన అతడిని హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు.
ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జాతీయ రహదారి 66లోని కోటేశ్వర్ సమీపంలో టైరు పంక్చర్ షాపు వద్ద 19 ఏళ్ల అబ్దుల్ రజీద్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. గత శనివారం ఉదయం ఒక స్కూల్ బస్సు టైర్‌కు పంక్చర్ అయ్యింది. దీంతో స్కూల్ బస్సును తన షెడ్ తీసుకొచ్చాడు డ్రైవర్. కాగా, మెకానిక్ అబ్దుల్ ఆ స్కూల్ బస్సు టైర్‌కు రిపేర్ చేశాడు. అనంతరం టైర్‌లోకి గాలి నింపసాగాడు. అయితే ఉన్నట్టుండి ఆ టైరు పేలింది. ఆ సమయంలో అక్కడ నుంచి కదలబోతున్న అబ్దుల్ ఒక్కసారిగా గాలిలోకి ఎగిరిపడ్డాడు. తలకు గాయమైన ఆ యువకుడ్ని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. ఆయన ప్రాణానికి ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్టు తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.