వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా?  99% మందికి ఈ విషయం అస్సలు తెలియదు

Velpula Bharath Rao

27 December 2024

చలికాలంలో వేడినీళ్లతో స్నానం చేయడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు. అయితే వేడినీళ్లతో స్నానం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

గీజర్‌లు వచ్చిన తర్వాత వేడినీళ్లతో స్నానం చేయడం ఈజీ అయింది. అయితే ఈ గీజర్ వాడే సమయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణానికే ప్రమాదకరం.

అప్పట్లో వేడి నీళ్లంటే గ్యాస్ మీదనో కట్టెల పోయ్యి మీద వేడి చేసుకునే వారు. కానీ ఇప్పుడు హీటర్, గీజర్‌లను అందరూ వాడుతున్నారు.

గీజర్‌ను స్నానం చేసిన వెంటనే ఆఫ్ చేయాలి. లేకపోతే కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉంది. ఇంకా కొందరు గీజర్‌ను అన్‌లో ఉండగానే స్నానం చేస్తారు.

ఇలా చేయడం వల్లే కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉంది. గీజర్‌లో వేడినీళ్లు 35-45 డిగ్రీల ఉష్టోగ్రతతో ఉండేలా చూసుకోవాలి. అంతేకంటే ఎక్కువ ఉంటే సమస్యలు వస్తాయి

మరీ వేడి నీళ్లతో స్నానం చేస్తే జట్టు రాలుతుంది. చర్మం కూడా పగిలిపోయే ఛాన్స్ ఉంది. ఇంకా ముఖ్యంగా వేడినీళ్లు చలికాలంలో మరింత ప్రమాదకరం

క్కువ సేపు స్నానం చేయడం వల్ల చర్మంలో ఉండే సహజనమైన నూనెలు కోల్పోతాయి. అలాగే ఆరు నెలలకు ఒక్కసారి గీజర్‌ను సర్వీస్ చేయాలి

ఇలాంటి జాగ్రత్తలు పాటించి గీజర్‌ను వాడితే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు.

ఇలాంటి జాగ్రత్తలు పాటించి గీజర్‌ను వాడితే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు.