ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

Anil kumar poka

|

Updated on: Dec 27, 2024 | 5:53 PM

విద్యుత్ వెలుగులతో చామంతి పూల సాగులో నూతన ఒరవడిని సృష్టిస్తున్నాడు యువరైతు అబ్దుల్లా. వేల సంఖ్యలో బల్బులను ఏర్పాటు చేసి.. పువ్వుల సాగు చేస్తున్నాడు కలిచెర్ల కు చెందిన ఈ యువరైతు. వాతావరణం సవాళ్లను తట్టుకుని అత్యధికంగా చామంతి పూల దిగుబడిని సాధిస్తున్నాడు.

అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం కలిచర్లకు చెందిన యువరైతు అబ్దుల్లా మదిలో ఒక వినూత్న ఆలోచన వచ్చింది. చామంతి చెట్టుకు గొడుగు పట్టి దాదాపు 5 ఎకరాల్లో వెచ్చని వాతావరణాన్ని ఏర్పాటు చేశాడు. ఔరంగాబాద్ లో పర్బాని యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ చేశాడు అబ్దుల్లా. ప్రతికూల వాతావరణంలోనూ మొక్క ఎదుగుదల చక్కగా ఉండేలా వినూత్న ప్రయోగం చేశాడు. కలకత్తా లో టిష్యూ కల్చర్ నర్సరీ నుంచి సెంట్ ఎల్లో రకానికి చెందిన 70 వేల చామంతి మొక్కలను తెచ్చి నెలరోజుల కిందట నాటాడు. దీనికోసం కొత్త విధానంతో ముందుకెళ్లాడు. చామంతి దిగుబడి ఆశాజనకంగా ఉండేందుకు చేసిన కొత్త ప్రయత్నం.. ఈ పల్లెటూరులో విద్యుత్ కాంతులను వెదజల్లుతోంది.

దాదాపు 4వేల ఎల్ఈడి బల్బులు ఏర్పాటు చేసి చామంతికి చలిలోనూ వెచ్చని వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎల్ఈడి బల్బుల కాంతి వల్ల చామంతి మొక్కలో కిరణజన్య సంయోగక్రియ రాత్రి పూట జరిగి ఎదుగుదలకు దోహదపడుతుందని చెప్పాడు. ఎకరం చామంతి సాగుకు 2.50 లక్షల రూపాయిలు పెట్టుబడి పెట్టిన అబ్దుల్లా.. మొక్క నాటిన 90 రోజుల్లోపు దిగుబడి వస్తుందన్నాడు. సరైన మెలకువలు పాటిస్తే దాదాపు మూడు నెలల వరకు చామంతి దిగుబడి ఉంటుందని.. ఎకరానికి 5 నుంచి 6 టన్నుల మేర దిగుబడి వస్తుందన్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.