Manali: మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
చలి తీవ్రతతో ఉత్తర భారతం గజగజా వణుకుతోంది. హిమాచల్‌ప్రదేశ్ లోని ప్రముఖ పర్యటక ప్రాంతమైన మనాలీపై మంచు దుప్పటి కప్పేసింది. హిమపాతం భారీగా ఉండటంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోహ్‌తంగ్‌లోని సొలాంగ్, అటల్ టన్నెల్‌ల మధ్య సోమవారం రాత్రి తర్వాత దాదాపు 1000కి పైగా వాహనాలు చిక్కుకుపోయాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
రాత్రి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అటల్ టన్నెల్ నుంచి మనాలిలోని సోలాంగ్ నాలా వరకు లేహ్ మనాలి జాతీయ రహదారిపై మంచు భారీగా కురిసింది. దీంతో వాహనాలు జారిపోయి సొరంగం దగ్గర అనేక వాహనాలను ఆపవలసి వచ్చింది. సొరంగ మార్గం నుంచి మనాలి వైపు సోలాంగ్ నాలా వరకు చాలా చోట్ల వాహనాలు జారిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అతి కష్టం మీద వాహనాలను దారి మళ్లించారు. ఇప్పటివరకు 700 మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం అటల్ టన్నెల్ మార్గంలో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. అటు రాజధాని సిమ్లాలోనూ మంచు కురుస్తోంది. హిమపాతం కారణంగా రాష్ట్రంలోని పలు రోడ్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. క్రిస్మస్, నూతన సంవత్సరం నేపథ్యంలో ఏటా డిసెంబరు చివరి వారంలో మనాలీకి పర్యాటకుల రద్దీ విపరీతంగా ఉంటుంది. గత కొన్ని రోజులుగా మంచు కురుస్తుండటంతో మనాలీ కి పర్యటకులు పోటెత్తారు. అయితే, నిన్న సాయంత్రం నుంచి వాతావరణం అనుకూలించలేదు. మంచు దట్టంగా కురుస్తుండటంతో ఎదురుగా ఉన్న వాహనాలు కన్పించని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనాలు ముందుకుకదల్లేక భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. గత కొద్ది రోజులుగా వేల సంఖ్యలో వాహనాలు ఈ ప్రాంతానికి వచ్చాయని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.