కేవలం పాలు తాగే బదులు ఇలా చేసి చూడండి.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో…

సాధారణంగా అన్ని మసాలా దినుసులను మితంగా తీసుకోవడం రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. కాలానుగుణంగా ఎదురయ్యే ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.

కేవలం పాలు తాగే బదులు ఇలా చేసి చూడండి.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో...
Cinnamon Milk
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 22, 2022 | 9:27 PM

నిత్య జీవితంలో మనల్ని వేధించే అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. మన ఆరోగ్య పరిస్థితి, ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థ వయస్సు, వాతావరణం అన్నీ కూడాను మన ఆరోగ్యంపై ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇలాంటి అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో సహాయపడే పానీయం గురించి మీకు తెలుసా..? కేవలం పాలు తాగే బదులు పాలలో దాల్చిన చెక్క కలుపుకుని తాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ఆ విషయం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…

పాలలో దాల్చిన చెక్క పొడిని కలిపి ఈ పానీయాన్ని తయారుచేయాలి. అవసరమైతే కొంచెం తీపిని కూడా జోడించుకోవచ్చు. కానీ చక్కెరను జోడించకుండా ఉండటం మంచిది. ముఖ్యంగా చలికాలంలో ఈ డ్రింక్ తాగాలి. చలికాలంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున, దాల్చినచెక్కను పాలలో కలుపుతారు. ఇలా తాగడం వల్ల మూడు ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరం బలాన్ని పెంచడంలో, వివిధ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, ఋతు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్కలో ఉండే సిన్నమాల్డిహైడ్ అనే పదార్ధం ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో సహాయపడుతుంది.

అనేక ఇతర పానీయాలను తీసుకోవడానికి బదులుగా ఈ డ్రింక్‌ తాగటం వల్ల ..ఇది కేలరీలను తగ్గిస్తుంది. ప్రోటీన్ తీసుకోవడం పెంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యానికి కూడా దాల్చిన చెక్క చాలా మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది చక్కెరను నియంత్రించడంలో పాక్షికంగా కూడా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

సాధారణంగా, అన్ని మసాలా దినుసులను మితంగా తీసుకోవడం రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. తద్వారా కాలానుగుణ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. కానీ రెగ్యులర్ గా కూరల్లో మాత్రమే కలుపుతాం. పాలలో దాల్చిన చెక్కను తీసుకోవడం కష్టంగా భావించే వారు టీలో (డార్క్ టీ కూడా) తీసుకోవచ్చు. లేదా పండ్ల రసాలలో కలుపుకోవచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి