చేతిలో డబ్బు నిలుకపోతే ఇలాంటి సాధారణ వాస్తు చిట్కాలు పాటించండి.. ఇవి మీ జీవితాన్ని మార్చగలవు

కొన్నిసార్లు వాస్తు దోషం కూడా డబ్బు రాకకు అడ్డంకులు పెడుతుంది. అటువంటి పరిస్థితిలో ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి ఈ సులభమైన వాస్తు చిట్కాలను ప్రయత్నించండి.

చేతిలో డబ్బు నిలుకపోతే ఇలాంటి సాధారణ వాస్తు చిట్కాలు పాటించండి.. ఇవి మీ జీవితాన్ని మార్చగలవు
Money
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 22, 2022 | 7:24 PM

ప్రతి వ్యక్తి రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి డబ్బు అవసరం. కానీ, జీవితంలో ప్రతి వ్యక్తి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన సమయం కూడా వస్తుంది. కష్టపడి పని చేసిన తర్వాత కూడా కొందరు వ్యక్తులు కష్టాల్ని అనుభవించాల్సి వస్తుంది. అయితే, అలాంటి వారు వాటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.కొన్నిసార్లు వాస్తు దోషం కూడా డబ్బు రాకకు అడ్డంకులు పెడుతుంది. అటువంటి పరిస్థితిలో ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి ఈ సులభమైన వాస్తు చిట్కాలను ప్రయత్నించండి.

1. డబ్బు దాచుకునే దిశ.. వాస్తు ప్రకారం..డబ్బు దాచుకునే అల్మారాను సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం. అందుకే ఖజానాను ఎప్పుడూ దక్షిణం వైపు ఉంచాలి. దాని తలుపు ఉత్తరం వైపు తెరవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి సంతుష్టులై ఇంటికి సంపదలు చేకూరుతాయని నమ్మకం. ఇంట్లో రంగుల ప్రాముఖ్యత కూడా ధన ప్రాప్తిపై ప్రభావం చూపిస్తుంది.

2. ఇంటికి వేసే రంగులు.. వాస్తు ప్రకారం.. ఇంటి గోడలకు సరైన రంగులు వేయడం చాలా ముఖ్యం. ఇంట్లో సరైన రంగులు ఉపయోగించకపోతే చాలాసార్లు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వాస్తు ప్రకారం, గదికి తూర్పున తెలుపు, పశ్చిమాన నీలం, ఉత్తరాన ఆకుపచ్చ, దక్షిణాన ఎరుపు రంగు వేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెబుతారు.

ఇవి కూడా చదవండి

3. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.. ఇంట్లో మురికిని ఉంచడం ద్వారా మహాలక్ష్మి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది. పరిశుభ్రత లేని ఇళ్లలో లక్ష్మీదేవి నివాసం ఉండదని చెబుతారు. అటువంటి పరిస్థితిలో ఇళ్లలో ఆశీర్వాదం లేదు. అందుకే మనిషి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

మరిన్ని రాశిఫలాలకు సంబంధించిన వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి