రోజ్ వాటర్ వల్ల మనకు తెలియని ఎన్నో ఉపయోగాలు..!! ఎలా ఉపయోగించాలంటే..

రోజ్ వాటర్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మచ్చలు, గాయాలు, కోతలను నయం చేయడానికి కూడా సహాయపడుతుంది.

రోజ్ వాటర్ వల్ల మనకు తెలియని ఎన్నో ఉపయోగాలు..!! ఎలా ఉపయోగించాలంటే..
Rose Water Benefits
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 22, 2022 | 6:17 PM

రోజ్ వాటర్ ఒక్కటి చాలు మీ చర్మ సంరక్షణ కోసం వివిధ అద్భుతమైన ప్రయోజనాలను అందించగలదు. దీన్ని మనం అన్ని రకాల చర్మాలకు ఉపయోగించవచ్చు. గులాబీ రేకులను నీటిలో నానబెట్టి తయారుచేసిన రోజ్ వాటర్ పురాతన కాలం నుండి సౌందర్య సాధనంగా ఉపయోగించబడింది. అందంగా ఉండాలని కోరుకునే ప్రతి అమ్మాయి ఇంట్లో ఇది తప్పకుండా ఉంటుంది. దీని ధర కూడా అందుబాటులోనే ఉండడంతో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. రోజ్ వాటర్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. రోజ్ వాటర్ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. నిగారింపుని తెస్తుంది. రోజ్ వాటర్ ఇంట్లో ఉంటే చాలు.. ఖరీదైనా టోనర్లు, సన్ స్క్రీన్ లోషన్లు, క్రీములతో అవసరమే ఉండదు. దీని లక్షణాలు దెబ్బతిన్న చర్మాన్ని పునరుద్ధరించడంలో సహాయపడతాయి. ఇది క్రిమిసంహారిణిగా కూడా పని చేయడం వల్ల చర్మవ్యాధులను కొంత వరకు నివారిస్తుంది. అందువల్ల రోజ్ వాటర్‌ను ఉత్తమ స్కిన్ టోనర్ అని కూడా పిలుస్తారు. చర్మం సహజ pH సంతులనాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది.

రోజ్‌ వాటర్‌ని వారానికి రెండు సార్లు చర్మానికి రాసుకుంటే ఎప్పటికప్పుడు వచ్చే అధిక సెబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఎరుపు, చర్మశోథ, తామర వంటి వివిధ చర్మ సమస్యలను నివారిస్తాయి. మొటిమల సమస్య ఉన్నవారు రోజ్ వాటర్ ను ఉపయోగించవచ్చు. ఇది గొప్ప క్లెన్సర్ కూడా. ఇది అడ్డుపడే రంధ్రాల నుండి పేరుకుపోయిన ఆయిల్‌, ధూళిని తొలగిస్తుంది. రోజ్ వాటర్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మచ్చలు, గాయాలు, కోతలను నయం చేయడానికి కూడా సహాయపడుతుంది.

రోజ్ వాటర్ జుట్టు సంబంధిత సమస్యలకు కూడా ఉపయోగపడుతుంది. ఇది తేలికపాటి స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్, చుండ్రుకు చికిత్స చేయగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది సహజమైన కండీషనర్‌గా పనిచేసి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. రోజ్ వాటర్‌లో కాటన్ ప్యాడ్‌లను ముంచి మీ కనురెప్పలపై అప్లై చేయండి. మీ కళ్ల చుట్టూ ఉన్న వేడిని తగ్గించడం ద్వారా తక్షణ ఉపశమనం పొందుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి