మీరు నిద్రించే విధానం మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా..? ఏ భంగిమ‌లో ప‌డుకుంటే ఉత్త‌మం?

నిద్ర అనేది శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి. నిద్ర వల్ల మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. దీంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే, ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖంపై ముడుతలు రావు. ముఖ్యంగా మహిళలకు ఇది చక్కటి పొజిషన్.

మీరు నిద్రించే విధానం మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా..? ఏ భంగిమ‌లో ప‌డుకుంటే ఉత్త‌మం?
How Much Sleep Do We Really Need each day
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 22, 2022 | 4:20 PM

జీవనశైలి, ఆహారం, చదవడం,రాయడం అలాగే నిద్రపోవడం. నిద్రపోతున్నప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే మీరు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది. ఇటీవల వెల్లడైన ఓ అధ్యయనంలో కొందరు యువకులు, ఆరోగ్యవంతులు నిద్రకు అంత ప్రాధాన్యత ఇవ్వరని తేలింది. వయస్సు పెరిగే కొద్దీ మన ఆరోగ్యం మారుతుంది. దీని కారణంగా మన నిద్ర స్థానం కూడా ముఖ్యమైనది. నిద్రపోయే భంగిమలు మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిద్రించడానికి సరైన మార్గం ఉందంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం…

నిద్ర అనేది శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి. నిద్ర వల్ల మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. దీంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. నిద్ర ఇమ్యూనిటీని పెంచుతుంది. నాడీ వ్యవస్థ సరిగా పనిచేసేందుకు దోహదం చేస్తుంది. హార్మోన్ల ఉత్పత్తి, నియంత్రణ సక్రమంగా జరుగుతుంది. నిద్ర తగ్గితే క్యాన్స‌ర్‌తోపాటు వివిధ అరోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశ‌ముంది. అయితే, నిద్ర‌పోయే భంగిమ‌లు కూడా ఆరోగ్యాన్ని ప్ర‌భావితం చేస్తాయ‌ని నిపుణులు సూచిస్తున్నారు.

వెల్ల‌కిలా ప‌డుకోవ‌డం.. వెల్ల‌కిలా ప‌డుకోవ‌డం వెన్నెముకకు మంచిది. గురుత్వాక‌ర్ష‌ణ వ‌ల్ల శ‌రీరం స‌మ‌త‌లంగా ఉంచ‌బ‌డుతుంది. ఇలాంటి స్థితిలో ప‌డుకున్న‌ప్పుడు మెడ‌కింద మంచి నాణ్య‌మైన దిండును ఉంచుకోవాలి. వీలైతే దిండు లేకుండా ఉండటం మరీ మంచిది అంటున్నారు వైద్య నిపుణులు. మెడ వంపు అర‌టిపండును పోలి ఉంటే బెట‌ర్‌. ఇలా ప‌డుకోవ‌డం ఆరోగ్య‌క‌రమ‌ని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, స్లీప్ ఆప్నియా లేదా వెన్ను స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఈ భంగిమ‌లో ప‌డుకోక‌పోవ‌డ‌మే మంచిద‌ని అంటున్నారు. ఈ రెండు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు వెల్ల‌కిలా ప‌డుకుంటే మెడ‌నొప్పులు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని చెబుతున్నారు. అలాగే, ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖంపై ముడుతలు రావు. ముఖ్యంగా మహిళలకు ఇది చక్కటి పొజిషన్.

ఇవి కూడా చదవండి

ప‌క్కకు తిరిగి ప‌డుకోవ‌డం.. వెల్ల‌కిలా ప‌డుకోవ‌డం ఇబ్బందిగా ఉన్న‌వారు ఎడ‌మ‌వైపు లేదా కుడివైపు తిరిగి ప‌డుకోవ‌చ్చు. అయితే, ఇలా ప‌డుకునేట‌ప్పుడు చెవి రంధ్రాలు భుజానికి స‌మాంత‌రంగా ఉండేలా చూసుకోవాలి. గ‌ద‌వ‌ను కిందికి ఆనించి ప‌డుకుంటే నొప్పి క‌లిగే అవ‌కాశ‌ముంటుంది. కాగా, గుండె మంట, అసిడిటీ లాంటి సమస్యలున్న‌వాళ్లు ఎడమవైపుకు తిరిగి పడుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎడమవైపునకు తిరిగి నిద్రిస్తే లివర్ పై భారం తగ్గుతుంది. కుడివైపు తిరిగి పడుకునేవారిలో నిద్రలేమి, అశాంతి లాంటివిచోటుచేసుకుంటున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

బోర్ల తిరిగి పడుకోవడం.. తలను ఒక దిశలో కొంత సమయం పాటు తిప్పుతూ కడుపుపై భారం వేసి పడుకోవడం వల్ల నొప్పి క‌ల‌గుతుంది. వెన్నెముకను అణిచివేసేటప్పుడు కడుపుపై​పడుకోవడం కూడా మెడను వెనుకకు విస్తరించవచ్చు. ఇది రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. నరాలను కుదించగలదు. ఒక‌సారి ఈ భంగిమ‌కు అలవాటుప‌డితే మాన‌డం క‌ష్టం. అయిన‌ప్ప‌టికీ దీర్ఘ‌కాలికంగా అలాగే ప‌డుకుంటే అనారోగ్య స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

గురకను ఎలా ఆపాలి? .. చాలా మంది గురక సమస్యతో కూడా ఇబ్బంది పడుతుంటారు. అలా కాకుండా ఉండాలంటే కడుపుపై ఒత్తిడి పడేలా బోర్లగా నిద్రిస్తే గురక పెట్టే అలవాటు తగ్గుతుందని అంటున్నారు. మీరు ఎక్కడ పడుకున్నా మెత్తని మంచం శుభ్రత అవసరం.. ఇక నుండి మీరు నిద్రపోయేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.

మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..