అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. వివరాలు అడిగి రాసుకున్న సిబ్బంది.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు..

ఈ వీడియో తెల్లవారుజామున 3 గంటలకు ఆస్పత్రిలోని సీసీటీవీలో రికార్డైంది. ఈ వీడియో చూస్తే నిజంగానే ఒంట్లో వణుకుపుట్టడం ఖాయం.

అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. వివరాలు అడిగి రాసుకున్న సిబ్బంది.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు..
Ghost Patient
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 22, 2022 | 3:48 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. తాజాగా వైరల్‌ అవుతున్న ఒక వీడియో నెటిజన్ల ఒళ్లు గగ్గుర్పొడిచేలా చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోపై విపరీతంగా చర్చనీయాంశంగా మారింది. ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డు కనిపించని వారితో మాట్లాడుతున్నట్లుగా వీడియో చూపిస్తుంది. ఆస్పత్రి సిబ్బంది దెయ్యంతో మాట్లాడుతున్నాడనే పుకార్లు వ్యాపించాయి. అర్జెంటీనాలోని ఓ ఆసుపత్రిలో CCTV ఫుటేజ్‌లో రికార్డైన వీడియో వింతగా ఉండటంతో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో రెడ్డిట్‌లో షేర్ చేయబడింది. మిలియన్ల మంది ఈ వీడియోని చూశారు.

మనలో చాలా మందికి దెయ్యం పేరు చెప్పగానే వణుకు పుడుతుంది. అసలు దెయ్యం ఉందా లేదా అనే వాదనను పక్కన పెడితే.. దెయ్యాలు ఉన్నాయనడానికి సాక్ష్యంగా పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ సెక్యూరిటీ గార్డు దెయ్యంతో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బ్యూనస్ ఎయిర్స్‌లోని ఫినోకియాటో శానిటోరియం అనే ప్రైవేట్ కేర్ సెంటర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో తెల్లవారుజామున 3 గంటలకు ఆస్పత్రిలోని సీసీటీవీలో రికార్డైంది. వీడియో ప్రారంభమైన వెంటనే, ఆసుపత్రి ప్రవేశ ద్వారం ఆటోమేటిక్‌గా తెరుచుకుంటుంది. శబ్దం విని, సెక్యూరిటీ గార్డు తన సీటులోంచి లేచి, డెస్క్‌లోని క్లిప్‌బోర్డ్‌ను తీసుకొని తలుపు వైపుకు వెళ్ళాడు. లైన్ డివైడర్ తీసేసి మాట్లాడటం మొదలుపెట్టాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. ఆ తర్వాత వీల్ చైర్‌లో కూర్చొని ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో సెక్యూరిటీ గార్డు ప్రవర్తన చూసి సోషల్ మీడియా యూజర్లు షాక్ అవుతున్నారు. అంతకు ముందు రోజు ఒక రోగి ఆసుపత్రిలో మరణించాడు. ప్రస్తుతం అతడు దెయ్యం రూపంలో వచ్చినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

కొంతమంది వినియోగదారులు ఈ ఫుటేజీని చూసి నివ్వెరపోతే, మరికొందరు అది ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. వీడియో రికార్డు అవుతుందని తెలిసి సిబ్బంది అలా చేశారని చెబుతున్నారు. అయితే దీనిపై స్థానిక మీడియా ఆరా తీస్తే.. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల మధ్య ఆటోమేటిక్ గా 28 సార్లు తలుపులు తెరుచుకున్నాయని యాజమాన్యం తెలిపింది. క్లిప్‌బోర్డ్ పేపర్‌పై సెక్యూరిటీ గార్డు ఏదో రాస్తున్నట్లు వీడియోలో కనిపించగా.. రిజిస్టర్‌లో ఏం రాయలేదని స్పష్టమైంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి