andhra pradesh: కూతురిపై ప్రేమతో గుడికట్టిన తండ్రి.. విగ్రహానికి నిత్య పూజలు..

రోడ్డు ప్రమాదం రూపంలో సుబ్బలక్షమ్మను మృత్యువు మింగేసింది. 2011లో రోడ్డు ప్రమాదంలో మరణించింది. సుబ్బలక్ష్మి మృతితో తల్లిదండ్రులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. కూతురి మరణం వృద్ధ దంపతులను కలచివేసింది.

andhra pradesh: కూతురిపై ప్రేమతో గుడికట్టిన తండ్రి.. విగ్రహానికి నిత్య పూజలు..
Daughter In Nellore
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 21, 2022 | 9:17 PM

పుట్టిన కూతుర్ని పురిట్లోనే చంపిన తండ్రి.. అప్పుడే పుట్టిన బిడ్డను వదిలి వెళ్లిపోయిన తల్లి.. 21వ శతాబ్ధంలో కూడా మన దేశంలో అలాంటి ఘటనలు అనేకం కనిపిస్తున్నాయి. ఒక్కోసారి ఇలాంటి ఆందోళనకరమైన సంఘటనలు వార్తల్లో ముఖ్యాంశాలుగా వస్తుంటాయి. కానీ, రాత్రి చీకటి మాత్రమే నిజం కాదు..సూర్యుడి కాంతి కూడా ఉంటుంది. అన్నది వాస్తవం..ఆ వెలుగులో ఈ దేశంలో దుర్గ, సీత, రాధా పలువురు దేవతా మూర్తులు పూజలందుకుంటున్నారు. వారితో పాటుగానే చనిపోయిన కూతురిని కూడా పూజించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కూతురిపై ప్రేమతో గుడి కట్టిన ఓ తండ్రి తన కూతురి విగ్రహాన్ని ఆ గుడిలో ప్రతిష్టించుకుని నిత్యం పూజలు చేస్తున్నాడు. తండ్రికి తన కూతురిపై ఉన్న ప్రేమను చూడాలంటే ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు వెళ్లాల్సిందే.

నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం కాకుటూరులో నివాసముంటున్న చెంచయ్య, లక్ష్మమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. నాల్గవ కుమార్తె సుబ్బలక్ష్మి పుట్టిన తర్వాత చెంచయ్య వైవాహిక జీవితం ఆర్థికంగా నిలదొక్కుకుంది. కుటుంబంలో సౌభాగ్యం పెరిగింది. సుబ్బలక్షమ్మ చదువు పూర్తి చేసి అటవీ శాఖలో ఉద్యోగం సంపాదించింది. కూతురికి ఉద్యోగం రావడంతో తల్లిదండ్రులు చాలా సంతోషించారు. అంతా సాఫిగా సాగుతుందనుకున్న సమయంలో విధి వారిని వంచింది. రోడ్డు ప్రమాదం రూపంలో సుబ్బలక్షమ్మను మృత్యువు మింగేసింది. 2011లో రోడ్డు ప్రమాదంలో మరణించింది. సుబ్బలక్ష్మి మృతితో తల్లిదండ్రులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. కూతురి మరణం వృద్ధ దంపతులను కలచివేసింది.

సుబ్బలక్ష్మి మరణానంతరం ఆమెకు గుడి కట్టించాడు తండ్రి చెంచయ్య. సుబ్బలక్ష్మి కోరిక మేరకు ఆలయాన్ని నిర్మించినట్లు చెంచయ్య తెలిపారు. తన కలలో గుడి కట్టామని తన కూతురు కోరిందని చెప్పాడు. అప్పటి నుండి, కుమార్తె విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి