AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హ్యాంగోవర్‌తో ఇబ్బంది పడుతున్నారా..? ఈ సింపుల్‌ చిట్కాలు మీ కోసమే..

మీకు కూడా వారాంతం తర్వాత హ్యాంగోవర్ సమస్య ఉంటే లేదంటే మీ ఇంట్లో ఎవరైనా హ్యాంగోవర్‌తో బాధపడుతుంటే మీరు కొన్ని ఇంటి నివారణలను పాటించడం ద్వారా దాన్ని అధిగమించవచ్చు.

హ్యాంగోవర్‌తో ఇబ్బంది పడుతున్నారా..? ఈ సింపుల్‌ చిట్కాలు మీ కోసమే..
Alcohol
Jyothi Gadda
|

Updated on: Nov 21, 2022 | 8:41 PM

Share

వారానికి 5 రోజులు 8 నుండి 9 గంటలు పని చేసి వారాంతం వచ్చేసరికి చాలా మంది వారాంతంలో బయటకు వెళ్లాలని కోరుకుంటారు. పార్టీలు, పబ్బులతో ఎంజాయ్‌ చేస్తుంటారు. వారాంతాల్లో ఎంజాయ్‌మెంట్ సమయంలో తీసుకున్న డ్రింక్స్ ఆ తర్వాత వారిని ఇబ్బందులకు గురిచేస్తుంది. నిజానికి, సరదా మూడ్‌లో వారాంతాల్లో మద్యంతో ఎక్కువగా ఎంజాయ్‌ చేస్తుంటారు. దాంతో ఇక సోమవారం ఆఫీసులో పని చేయడం కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు హ్యాంగోవర్ ఎక్కువ అవుతుంది. ఇలా కొందరు ఆఫీసులో సెలవు పెట్టి  ఇంటికి తిరిగి వెళతారు. వారాంతం తర్వాత మాత్రమే హ్యాంగోవర్ రావాల్సిన అవసరం లేదు, ఏ రోజు అయినా సరదా మూడ్‌లో శరీర సామర్థ్యం కంటే ఎక్కువ డ్రింక్స్ తీసుకోవడం వల్ల హ్యాంగోవర్ వస్తుంది.

ఏదైనా మత్తు పదార్థం వినియోగించే ముందు దానిపైనే శరీరానికి హానికరం అని ఒక హెచ్చరిక స్పష్టంగా వ్రాయబడి ఉంటుంది. అయినప్పటికీ ఆనందం కోసం తాగుతారు. సరదా మూడ్‌లో శరీర సామర్థ్యాన్ని కూడా పట్టించుకోరు. ఒకదాని తర్వాత ఒకటి పలు రకాల వెరైటీలను కూడా స్వాహా చేస్తుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన శరీరం రోజుకు 3 పానీయాలను మాత్రమే జీర్ణం చేసుకుంటుంది. ఇంతకు మించి తాగితే వాంతులు, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. మీకు కూడా వారాంతం తర్వాత హ్యాంగోవర్ సమస్య ఉంటే లేదంటే మీ ఇంట్లో ఎవరైనా హ్యాంగోవర్‌తో బాధపడుతుంటే మీరు కొన్ని ఇంటి నివారణలను పాటించడం ద్వారా దాన్ని అధిగమించవచ్చు.

పార్టీ మరుసటి రోజు మీరు నిద్రలేచిన తర్వాత అల్పాహారం తప్పని సరిగా తీసుకోండి. హ్యాంగోవర్‌ను తగ్గించడంలో అల్పాహారం సహాయపడుతుంది. తాగిన డ్రింక్స్‌ వల్ల తలనొప్పి లేదా హ్యాంగోవర్ అనుభూతిని కలిగి ఉంటే, అల్పాహారంలో అరటిపండు, పీనట్స్‌ బట్టర్‌తో బ్రెడ్‌ తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇది తలనొప్పి, అలసటను తొలగిస్తుంది.

ఇవి కూడా చదవండి

నిమ్మరసం తాగండి.. హ్యాంగోవర్ తగ్గాలంటే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగాలి. మీరు పార్టీ రాత్రి లేదా మరుసటి రోజు ఉదయం నిమ్మరసం తయారు చేసుకుని తాగాలి. దీనివల్ల వికారం, వాంతులు మొదలైన అవకాశాలు తగ్గుతాయి.

టీ లేదా కాఫీ.. టీ, కాఫీలలో ఉండే కెఫిన్ మన శరీరాన్ని అప్రమత్తం చేసే ఉద్దీపనగా పనిచేస్తుంది. ఇది హ్యాంగోవర్ సమయంలో వచ్చే నెర్వస్‌నెస్‌ని తగ్గిస్తుంది. శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది.

పెరుగు తినండి.. హ్యాంగోవర్ లేదా డ్రింక్ వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించుకోవడానికి పెరుగు తీసుకోవాలి.. పెరుగులో పంచదార మొదలైనవి వేయకండి. పెరుగు శరీరంలోని మంచి బ్యాక్టీరియాను కమ్యూనికేట్ చేస్తుంది. దీని కారణంగా శరీరం బ్యాలెన్స్ చేసుకుంటుంది.

అల్లం .. అల్లంలో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది ఆల్కహాల్ టాక్సిన్స్ నుండి బయటపడటానికి సహాయపడుతుంది. అల్లం టీ తాగడం వల్ల డయేరియా, వికారం, వాంతులు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

స్పోర్ట్స్ డ్రింక్స్ .. హ్యాంగోవర్ తగ్గించుకోవడానికి మీరు స్పోర్ట్స్ డ్రింక్స్ తాగవచ్చు. వాటిలో చాలా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. వాస్తవానికి, ఆల్కహాల్ తాగడం వల్ల, శరీరంలో ఉప్పు, పొటాషియం పరిమాణం తగ్గుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి