AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Recipe: చక్క నూనె వేయకుండా కరకరలాడే మసాలా శనగలు తయారీ విధానం ఇలా..

మీరు రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారం కోసం చూస్తున్నట్లయితే.. జీరో ఆయిల్ చనా మసాలా రిసిపిని ట్రై చేయండి. ఇది మీ బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

Healthy Recipe: చక్క నూనె వేయకుండా కరకరలాడే మసాలా శనగలు తయారీ విధానం ఇలా..
Crispy Chatpata Chana Masala
Sanjay Kasula
|

Updated on: Nov 21, 2022 | 8:59 PM

Share

చలికాలంలో కరకరలాడే మసాల శనగలు తినింటే ఆ.. మజానే వేరుగా ఉంటుంది. అయితే వీటిని తెల్ల శ‌న‌గ‌లు, చోలే, పంజాబీ శనగలు అని కూడా అంటారు. తెల్ల శ‌న‌గ‌ల‌ను ఆహారంగా తీసుకోవటం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. అత్య‌ధికంగా ప్రోటీన్ల‌ను క‌లిగి ఉన్న వృక్ష సంబంధ‌మైన ఆహారాల్లో ఈ శ‌న‌గ‌లు ఒక‌టి. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గించ‌డంతోపాటు బ‌రువును తగ్గించ‌డంలోనూ ఇవి స‌హాయ‌ప‌డ‌తాయి. ఫోలిక్ యాసిడ్‌, ఫైబ‌ర్‌, మెగ్నిషియం, జింక్‌, ఐర‌న్, కాల్షియం, విట‌మిన్ ఎ వంటి పోష‌కాలు వీటిలో అత్య‌ధికంగా ఉంటాయి. మీరు త్వరగా బరువు తగ్గాలని కోరుకుంటే కానీ చప్పగా లేదా రుచిలేని ఆహారాన్ని తినకూడదు. మీరు ఆరోగ్యకరమైన, రుచికరమైన అల్పాహారం కోసం చూస్తున్నట్లయితే.. ఈ వంటకం మీ కోసమే.. ఈరోజు మేము మీతో టేస్టీగా, తక్కువ క్యాలరీలతో కూడిన స్పైసీ రిసిపిని షేర్ చేసుకుంటున్నాం.

మీరు ఇంట్లో ఉంచుకున్న పంజాబీ శనగలతో ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇది ఎంత రుచికరమైనదో అంతకంటే ఎక్కవ ఆరోగ్యకరమైనది. అది మరింత క్రంచీగా, క్రిస్పీగా ఉంటుందో మీరు చేసిన తర్వాత చూడవచ్చు. మీరు అల్పాహారంలో తినగలిగే జీరో ఆయిల్ క్రంచీ, క్రిస్పీ స్నాక్స్ అని చెప్పవచ్చు. ఈ శనగలతో  చేసిన ఈ స్పైసీ రిసిపిలో చుక్క నూనె కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదు. కాబట్టి జీరో ఆయిల్ మసాలా శనగలు రిసిపిని ఎలా చేయాలో  తెలుసుకుందాం.

జీరో ఆయిల్ మసాలా చానా కోసం కావలసినవి

  • 1 టేబుల్ స్పూన్ చనా మసాలా
  • 2 కప్పులు తెల్ల శనగలు
  • అర కప్పు నిమ్మరసం
  • ఉప్పు అవసరం
  • 1/4 స్పూన్ నల్ల మిరియాలు
  • 1/2 స్పూన్ ఎర్ర మిరప పొడి

జీరో-ఆయిల్ మసాలా చోలా రెసిపీ

శనగలను నానబెట్టండి 

ఈ జీరో ఆయిల్ బ్రేక్ ఫాస్ట్ రెసిపీని తయారు చేయడానికి మీకు రెండు కప్పుల తెల్ల శనగలు అవసరం. ముందుగా శనగలను నీళ్లలో నానబెట్టి ఉంచుకోవాలి. కావాలంటే ఈ శనగల రాత్రంతా నానబెట్టి ఉంచుకోవాలి.

శనగల ఉడకబెట్టండి

శనగలు బాగా ఉడికిన తర్వాత నీళ్లు తీసి కుక్కర్‌లో శెనగలు వేసి ఉడకనివ్వాలి.

మసాల ఇలా..

శనగలు ఉడకబెట్టిన తర్వాత.. వాటిని చల్లబరచండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో నిమ్మరసం, మసాలా దినుసులు కలపాలి. అందులో శనగలు వేసి కలపండి.

దానిని కాల్చండి 

మసాలాలు బాగా కలిపిన తర్వాత, ఒక పార్చ్‌మెంట్ పేపర్‌ను తీసుకుని అందులో శనగలను స్ప్రెడ్ చేసి 25 నిమిషాలు కాల్చండి. అది క్రిస్పీగా, క్రిస్పీగా మారుతుంది.

ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

రోగ నిరోధ‌క శ‌క్తిని, జీర్ణ శ‌క్తిని, ఎముక‌ల ధృడ‌త్వాన్ని పెంచ‌డంలో ఇవి ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. బీపీని, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌ను త‌గ్గించ‌డంలో ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇన్ని ఉప‌యోగాలు ఉన్న తెల్ల శ‌న‌గ‌ల‌ను ఆహారంలో భాగంగా చేసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వీటితో చేసే వంట‌కాల‌ల్లో చోలే మ‌సాలా కూర ఒక‌టి.

మరిన్ని ఆహార వార్తల కోసం