AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముదురు రంగు మూత్రం, దీర్ఘకాలిక పొత్తికడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా..? ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందో తెలుసా..?

కాలక్రమేణా అవి కాస్తా పిత్తాశయ రాళ్లుగా గట్టిపడతాయి. కొన్ని పిత్త ఆమ్లాలు వల్ల సైతం పిత్తాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ముదురు రంగు మూత్రం, దీర్ఘకాలిక పొత్తికడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా..? ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందో తెలుసా..?
Gall Bladder
Jyothi Gadda
|

Updated on: Nov 22, 2022 | 3:13 PM

Share

కిడ్నీలో రాళ్లతో ఎంత ప్రమాదమో అందరికీ తెలిసిందే.. కానీ మన పిత్తాశయం(గాల్‌ బ్లాడర్‌)లో కూడా రాళ్లు ఏర్పడతాయని మీకు తెలుసా? ఇది ఒక్కోసారి ప్రాణాల మీదకు వస్తుంది. అయితే తెలిసో తెలియకో దీనిని చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. గాల్ బ్లాడర్ ప్రమాదంలో ఉన్నప్పుడు, జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పిత్తాశయ రాళ్లు, ఇతర పిత్తాశయ సమస్యలతో తీవ్రమైన కడుపు నొప్పి మొదలవుతుంది. పిత్తాశయ సమస్యలు తేలికపాటి నుండి తీవ్రమైన లక్షణాల వరకు ఉంటాయి. ఆహారం తీసుకున్న ప్రతిసారీ పిత్తాశయం పిత్తాన్ని విడుదల చేస్తుంది. భోజనం మానేసినప్పుడు పిత్త రసాలు పేరుకుపోతాయి. దీని వల్ల పిత్తాశయంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.. కాలక్రమేణా అవి కాస్తా పిత్తాశయ రాళ్లుగా గట్టిపడతాయి. కొన్ని పిత్త ఆమ్లాలు వల్ల సైతం పిత్తాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

పిత్తాశయ రాళ్లు పిత్తాశయం లేదా చిన్న ప్రేగులలోకి పిత్తం, సాధారణ ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. ఇది దీర్ఘకాలిక పొత్తికడుపు నొప్పికి దారి తీస్తుంది. పిత్తాశయం శరీరంలోని అంతర్గత జీర్ణ సమతుల్యతను నిర్వహించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న అవయవం. అయినప్పటికీ, కొన్ని సంక్లిష్టమైన, దీర్ఘకాలిక రుగ్మతలు పిత్తాశయంపై ప్రభావం చూపుతాయి. పిత్తాశయంలో సంభవించే కొన్ని వ్యాధులు, శరీరం ప్రమాదంలో ఉన్నప్పుడు కనిపించే వివిధ లక్షణాలను ఇక్కడ తెలుసుకుందాం..

మీ పిత్తాశయం సరిగ్గా పని చేయనప్పుడు అది అనేక ఇబ్బందులకు దారితీస్తుంది. పిత్తాశయం అనారోగ్యానికి గురైతే జీర్ణవ్యవస్థ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. పిత్తాశయ రాళ్లు, ఇతర పిత్తాశయ పరిస్థితులు తీవ్రమైన కడుపు నొప్పికి దారితీస్తాయి.. ఇది అనేక దశల్లో రావచ్చు. పిత్తాశయం సమస్యల వల్ల వచ్చే కడుపు నొప్పి 30 నిమిషాల నుండి కొన్ని గంటల వరకు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పిత్తాశయం చాలా సాధారణమైన కానీ, తీవ్రమైన వ్యాధులకు లోనవుతుంది. వాటిలో కొన్ని- గాల్ బ్లాడర్ స్టోన్, గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ వంటివి కలుగుతాయి. పిత్తాశయం కాలేయం క్రింద ఉన్న ఒక అవయవం. ఈ అవయవం కాలేయంలో ఉత్పత్తి చేయబడిన పిత్తాన్ని నిల్వ చేస్తుంది. కేంద్రీకరిస్తుంది. పిత్తాశయం సరిగ్గా పని చేయనప్పుడు, సరైన చికిత్స లేనప్పుడు తీవ్రమైన కోలిసైస్టిటిస్ సంభవిస్తుంది. ఇది కొన్నిసార్లు ప్రాణాంతక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

మీ పిత్తాశయం ప్రమాదంలో ఉంటే, శరీరం అనేక రకాల సంకేతాలను ఇస్తుంది. పిత్తాశయ సమస్యలు తేలికపాటి నుండి తీవ్రమైన లక్షణాల వరకు ఉంటాయి. పిత్తాశయ రాయి పూర్తి అవరోధాన్ని సృష్టించినప్పుడు, ఇది పిత్తాశయం లేదా చిన్న ప్రేగులలోకి పిత్తం, సాధారణ ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. ఇది దీర్ఘకాలిక పొత్తికడుపు నొప్పికి దారి తీస్తుంది. వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం, తీవ్రమైన అలసట, ఆకస్మిక బరువు తగ్గడం, కామెర్లు, చలితో కూడిన జ్వరం, చర్మం దురద, రాత్రిపూట చెమటలు, ముదురు రంగు మూత్రం, మలం రంగు మారడం వంటి వివిధ వ్యాధుల లక్షణాలు పిత్తాన్ని ప్రభావితం చేస్తాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి