AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెదడు పై కోవిద్ తీవ్ర ప్రభావం.. MRI స్కాన్ రిపోర్టు పరిశీలించిన వైద్య నిపుణులు షాక్

కోవిద్ ఎంత ప్రభావం చూపిందో అందరికీ తెలుసు. కరోనా ప్రభావంతో ప్రపంచం అతాలకుతలం అయిపోయింది. ఇప్పుడిప్పుడే కోవిద్ తగ్గుముఖం పట్టడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. కరోనా మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. అయితే తాజాగా వెల్లడైన ఓ అధ్యయనం ప్రకారం..

మెదడు పై కోవిద్ తీవ్ర ప్రభావం.. MRI స్కాన్ రిపోర్టు పరిశీలించిన వైద్య నిపుణులు షాక్
Mri Scan
Amarnadh Daneti
|

Updated on: Nov 22, 2022 | 11:53 AM

Share

కోవిద్ ఎంత ప్రభావం చూపిందో అందరికీ తెలుసు. కరోనా ప్రభావంతో ప్రపంచం అతాలకుతలం అయిపోయింది. ఇప్పుడిప్పుడే కోవిద్ తగ్గుముఖం పట్టడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. కరోనా మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. అయితే తాజాగా వెల్లడైన ఓ అధ్యయనం ప్రకారం కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తులు అనేక దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నారట. కరోనా నుంచి రికవరీ అయిన సమయం నుంచి 6 నెలల వరకు మెదడులో మార్పులు సంభవించాయని ఐఐటీ-ఢిల్లీ పరిశోధకులు జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఒక ప్రత్యేక ఎమ్మారై స్కానింగ్ యంత్రం ద్వారా ఐఐటీ-ఢిల్లీ పరిశోధకులు ఈ అధ్యయనం జరిపారు. కోవిడ్ వల్ల ప్రతి ఐదుగురు వయోజనుల్లో ఒకరు దీర్ఘకాలిక ప్రభావాలకు గురయ్యారని అధ్యయనం స్పష్టం చేసింది. ఆలోచించడంలో ఇబ్బంది, ఏకాగ్రత లోపం, తలనొప్పి, నిద్ర లేమి సమస్యలు, సూదులతో గుచ్చినట్టు అనిపించడం, వాసన, రుచిలో మార్పులు, డిప్రెషన్, యాంగ్జైటీ వంటి న్యూరలాజికల్ లక్షణాలు కోవిడ్‌ కారణంగా కనిపించాయని ఈ అధ్యయనం వెల్లడించింది. లక్షణాలు కనిపించని పేషెంట్లలో కూడా కోవిడ్ కారణంగా గుండె, ఊపిరితిత్తులు, ఇతర అవయవాల్లో మార్పులు సంభవించాయని అధ్యయనం తేల్చింది. మెదడుపై కోవిడ్ ప్రభావాలను వెయిటెడ్ ఇమేజింగ్ మిషన్ ద్వారా విశ్లేషించడంపై జరిగిన ఈ అధ్యయన నివేదికను రేడియోలజీ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా (ఆర్ఎస్ఎన్ఏ)కు సమర్పించనున్నారు.

రక్తం, ఇనుము, కాల్షియం వంటి నిర్దిష్ట పదార్థాలు అనువర్తిత అయస్కాంత క్షేత్రంలో అయస్కాంతీకరణకు గురైన పరిమాణాన్ని మాగ్నెటిక్ ససెప్టబిలిటీ ఇమేజింగ్ వ్యవస్థ సూచిస్తుంది. మైక్రోబ్లీడ్స్, మెదడు కణితులు, స్ట్రోక్‌లతో సహా అనేక న్యూరోలాజిక్ పరిస్థితులను గుర్తించడంలో, పర్యవేక్షించడంలో ఈ సామర్థ్యం సహాయపడుతుంది. కోవిడ్-కారణంగా మెదడు యొక్క అయస్కాంత గ్రహణశీలతలో మార్పులపై గతంలో గ్రూప్ లెవల్ అధ్యయనాలు జరగలేదని ఐఐటీ ఢిల్లీ పరిశోధకులు తెలిపారు. తమ అధ్యయనం కోవిడ్ యొక్క న్యూరలాజికల్ ప్రభావాలను సూచిస్తోందని, కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో అసాధారణతలను ఈ అధ్యయనం సూచిస్తోందని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న 46 మంది డేటాను ఈ అధ్యయనంలో భాగంగా పరిశీలించగా.. సుదీర్ఘకాలం కోవిడ్‌తో బాధపడిన పేషెంట్లలో ఎక్కువ మందిలో అలసట, నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం, మెమొరీ కోల్పోవడం వంటి లక్షణాలు కన్పించాయని ఈ అధ్యయనం వెల్లడించింది.

కోవిడ్-19 నుంచి కోలుకున్న పేషెంట్లలో ఫ్రంటల్ లోబ్‌, బ్రెయిన్ స్టెమ్‌లో ససెప్టిబులిటీ వ్యాల్యూ గణనీయమైన స్థాయిలో ఎక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు. ఫ్రంటల్ లోబ్ క్లస్టర్లలో తెల్లని పదార్థంలో తేడాలు కనిపించాయని వెల్లడించారు. ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న నెలల తర్వాత కూడా కరోనా వైరస్ వల్ల కలిగే తీవ్రమైన దీర్ఘకాలిక సమస్యలను ఈ అధ్యయనం సూచిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ మెదడు అసాధారణతలు ఎక్కువ కాలం పాటు కొనసాగుతాయో లేదో తెలుసుకోవడానికి పరిశోధకులు అదే రోగి సమూహంపై అధ్యయనాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..