Telangana: తెలంగాణలో కాంట్రాక్టు అధ్యాపకులకు గుడ్ న్యూస్.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు..

తెలంగాణలో కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్దీకరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేస్తున్నవారిని క్రమబద్దీకరించేందుకు చర్యలు..

Telangana: తెలంగాణలో కాంట్రాక్టు అధ్యాపకులకు గుడ్ న్యూస్.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు..
CM KCR (File Photo)
Follow us

|

Updated on: Nov 15, 2022 | 3:31 PM

తెలంగాణలో కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్దీకరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేస్తున్నవారిని క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించనున్నట్టుగా ప్రకటించింది.ఈ దిశగా కేసీఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2016 ఫిబ్రవరి 26న 16వ నెంబర్ జీవోను జారీ చేసింది. అయితే ఈ జీవోపై మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అభ్యర్ధి ఒకరు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు కాంట్రాక్టు లెక్చరర్ల పోస్టుల భర్తీకి అనుకూలంగా ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన తీర్పును వెలువరించింది. దీంతో కాంట్రాక్టు లెక్చరర్ల పోస్టుల భర్తీకి అడ్డంకులు తొలగినట్లయింది. అడ్డంకులు తొలగడంతో కాంట్రాక్టు లెక్చరర్ల పోస్టుల భర్తీని చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే అర్హులైన కాంట్రాక్టు లెక్చరర్ల జాబితాను అధికారులు ప్రభుత్వానికి పంపించారు. త్వరలోనే కాంట్రాక్టు లెక్చరర్ల పోస్టులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెల్లడించే అవకాశం ఉంది.

కాగా.. మంగళవారం ప్రగతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణలోనిఒకేసారి 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. తెలంగాణ రాష్ట్రం దేశ వైద్యరంగంలోనే నూతన అధ్యాయాన్నిలిఖించింది. జిల్లాకో వైద్యకళాశాలను ఏర్పాటు చేయాలనే సీఎం కేసీఆర్‌ సంకల్పం సాకారమయ్యే దిశగా కీలక ముందడుగు పడింది. ఒకే ఏడాది ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. ప్రగతిభవన్‌లో నిర్వహించిన కార్యక్రమం ద్వారా నూతన వైద్య కళాశాలల్లో ఏకకాలంలో తరగతులను సీఎం కేసీఆర్‌ వర్చువల్‌గా ప్రారంభించారు.

వైద్యవిద్య కళాశాలలను ప్రారంభించిన సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణకు ఇది సువర్ణాధ్యాయమని.. మరిచిపోలేని రోజు అని అన్నారు. వైద్య విద్యార్థులు, వైద్యశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు, వైద్య కళాశాలల నిర్వాహకులకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. గతంలో తాగునీటికి, సాగునీటికి, మెడికల్‌ సీటుకి, ఇంజినీరింగ్‌ సీటుకు ఎన్నో రకాల అవస్థలు పడ్డామని, స్వరాష్ట్రంగా తెలంగాణ ఏర్పడటంతో ఇప్పుడు అద్భుతంగా, ఆత్మగౌరవంతో బతుకుతున్నామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..