Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివాహ బంధానికి రెడీ అవుతున్న యువత.. కొద్ది రోజుల్లో మొదలు కానున్న మంచి ముహుర్తాలు..

జీవితంలో వివాహబంధం విశిష్టత, ప్రాధాన్యత ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే పెళ్లి చేసేటప్పుడు వెనకా, ముందు ఆలోచించి చేయాలంటారు. అంతేకాదు.. మంచి ముహుర్తం కూడా చూస్తారు. పెళ్లి కుదిరిన తర్వాత వివాహం కోసం జాతకాలకు తగ్గ ముహుర్తం కోసం నెలల..

వివాహ బంధానికి రెడీ అవుతున్న యువత.. కొద్ది రోజుల్లో మొదలు కానున్న మంచి ముహుర్తాలు..
Marriage
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 13, 2022 | 9:57 AM

జీవితంలో వివాహబంధం విశిష్టత, ప్రాధాన్యత ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే పెళ్లి చేసేటప్పుడు వెనకా, ముందు ఆలోచించి చేయాలంటారు. అంతేకాదు.. మంచి ముహుర్తం కూడా చూస్తారు. పెళ్లి కుదిరిన తర్వాత వివాహం కోసం జాతకాలకు తగ్గ ముహుర్తం కోసం నెలల తరబడి వెయిట్‌ చేస్తూ ఉంటారు. పిల్లలకు పెళ్లి చేయడాన్ని ఓ బాధ్యతగా భావిస్తారు తల్లిదండ్రులు. వయస్సు వచ్చిన యువత పెళ్లి కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. నాలుగు నెలలుగా మంచి ముహుర్తాలు లేకపోవడంతో మంచి ముహుర్తాలు ఎప్పుడు వస్తాయా అంటూ పెళ్లి కోసం సిద్ధమైన యువత ఎదురుచూస్తున్నారు. మరోవైపు దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత వస్తున్న శుభ ముహూర్తాలకు తమ పిల్లల వివాహాలు జరిపించేందుకు పెద్దలు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి నవంబర్‌ నెలాఖరు వరకు సరైన ముహూర్తాలు లేవడంతో చాలా పెళ్లిళ్లు మాటలు పూర్తైనా.. వివాహం జరగలేదు. దీంతో వివాహాలు జరిపించేందుకు శుభలగ్నం కోసం ఎదురుచూస్తున్నారు. మూఢం ముగియడంతో నవంబర్‌ 28వ తేదీ నుంచి శుభ ముహూర్తాలు రానున్నాయి. డిసెంబర్ 16 నుంచి జనవరి 14 మినహిస్తే మార్చి వరకు మంచి ముహుర్తాలు ఉన్నాయంటున్నారు పండితులు. తరువాత మే నెలలో కూడా శుభలగ్నాలున్నాయంట. నవంబర్‌ 28 నుంచి డిసెంబర్‌ 12 వరకు ఏడు బలమైన ముహూర్తాలు ఉన్నాయని చెబుతున్నారు. డిసెంబర్‌ 16 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాసం కావడంతో ఈ సమయంలో వివాహాలు చేయరు. దీంతో వచ్చే ఏడాది జనవరి 19 నుంచి మార్చి 9 వరకు 18 శుభముహుర్తాలు ఉన్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికే ముహుర్తాలు ఖరారు కావడంతో పెళ్లి పనులు ప్రారంభించేశారు చాలా మంది. ప్రస్తుత శుభకృత్‌ నామ తెలుగు సంవత్సరం నవంబర్‌ నుంచి వచ్చే మార్చి వరకు దేశ వ్యాప్తంగా 35 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే లక్షా 50 వేలకుపైగా వివాహాలు జరుగుతాయని లెక్కగడుతున్నారు. ముహూర్తాలు దగ్గర పడుతుండటంతో మార్కెట్లకు పెళ్లి కళ వచ్చింది. ఇప్పటికే ఇళ్లను అందంగా అలకరించుకోవడం కోసం ఇంటి మరమ్మతుల చేయించడానికి రెడీ అయిపోతుండటంతో సిమెంట్‌ పనులు, ఇళ్లకు రంగులు తదితర అలంకరణ పనులు ఊపందుకుంటున్నాయి. బంగారం దుకాణాలు జనంతో నిండిపోతున్నాయి. దుస్తుల షాపులు, పాదరక్షల షాపులు, పెళ్లి శుభలేఖల ప్రింటింగ్ ప్రెస్‌లు ఇలా అన్ని బిజిబిజిగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పెళ్లిళ్ల కోసం చాలా చోట్ల కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు, హోటళ్లు, బాంక్వెట్‌ హాళ్ల అడ్వాన్సు బుకింగ్‌ చేసేశారు. కొన్ని కళ్యాణ మండపాల్లో అయితే ఒకే రోజు మూడు పెళ్లిళ్లు జరిగేందుకు కూడా బుకింగ్‌లు అయిపోయయంటున్నారు.

నాలుగు నెలల తర్వాత బలమైన ముహూర్తాలు వస్తుండటంతో పెళ్లి భజింత్రాలు మోగించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మూఢం లో వివాహాలు జరిపించరు. ప్రస్తుత శుభకృత్‌ నామ సంవత్సరం తర్వాత వచ్చే శోభకృత్‌ నామ సంవత్సరం 2023 మే నెల వరకు శుభలగ్నాలు ఉన్నాయంటున్నారు పండితులు. మొత్తంగా ఈ నెల నుంచి వచ్చే ఏడాది మే వరకు దాదాపు 42 మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

దేవర సినిమాలో చేసిన ఈ నటి.. బయట మాములుగా లేదుగా..
దేవర సినిమాలో చేసిన ఈ నటి.. బయట మాములుగా లేదుగా..
MNC జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. ఇప్పుడు టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్
MNC జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. ఇప్పుడు టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్
ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌కు పండగే..!
ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌కు పండగే..!
దేవీపుత్రుడులో నటించిన పాప ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?
దేవీపుత్రుడులో నటించిన పాప ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?
మీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ ప్లేవర్ మీ వ్యక్తిత్వాన్ని చెప్పెస్తుంది
మీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ ప్లేవర్ మీ వ్యక్తిత్వాన్ని చెప్పెస్తుంది
నమో భారత్ రైలులో ఉచిత ప్రయాణం.. ప్రయాణికులు చేయాల్సింది ఇదే..!
నమో భారత్ రైలులో ఉచిత ప్రయాణం.. ప్రయాణికులు చేయాల్సింది ఇదే..!
సద్గురు చెప్తున్న డైట్ నెల రోజులు పాటిస్తే ఎన్ని లాభాలో..
సద్గురు చెప్తున్న డైట్ నెల రోజులు పాటిస్తే ఎన్ని లాభాలో..
కొత్త పద్దతుల్లో సైబర్‌ మోసాలు.. బీ కేర్‌ఫుల్‌.. గుర్తించడమెలా?
కొత్త పద్దతుల్లో సైబర్‌ మోసాలు.. బీ కేర్‌ఫుల్‌.. గుర్తించడమెలా?
IND vs ENG: ఇకపై భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య పటౌడీ ట్రోఫీ జరగదు..
IND vs ENG: ఇకపై భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య పటౌడీ ట్రోఫీ జరగదు..
మార్కెట్‌లో ఈ రెండు కార్లకు తిరుగులేదు.. ప్రత్యేకతలు ఏంటంటే..?
మార్కెట్‌లో ఈ రెండు కార్లకు తిరుగులేదు.. ప్రత్యేకతలు ఏంటంటే..?