Telangana: ప్రాణం తీసిన ఫేస్ బుక్ పరిచయం.. పెళ్లి చేసుకోమంటే ఇటుకతో కొట్టి చంపాడు..
సోషల్ మీడియా వల్ల ఎంత ప్రమాదం ఉందో వివరించే ఇన్సిడెంట్ ఇది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్.. ఫోన్ లో అన్ లిమిటెడ్ డేటా కారణంగా గంటలకు గంటలు అందులోనే గడిపేస్తున్నారు. ఆడా మగా, చిన్నా పెద్దా,,
సోషల్ మీడియా వల్ల ఎంత ప్రమాదం ఉందో వివరించే ఇన్సిడెంట్ ఇది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్.. ఫోన్ లో అన్ లిమిటెడ్ డేటా కారణంగా గంటలకు గంటలు అందులోనే గడిపేస్తున్నారు. ఆడా మగా, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందులోనే మునిగి తేలుతున్నారు. పరిచయం లేని వారితో పరిచయాలు పెంచుకుంటున్నారు. వారితో సన్నిహితంగా ఉంటూ కుటుంబాన్ని మర్చిపోతున్నారు. వారి మాటలు నమ్మి నిలువునా మోసపోతున్నారు. తాజాగా నిజామాబాద్ కు చెందిన ఓ మహిళకు ఫేస్ బుక్ లో యూపీకి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. అతని ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లిన ఆమె దారుమ హత్యకు గురైంది. తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన మహిళకు ఫేస్ బుక్ ద్వారా ఉత్తర ప్రదేశ్ కు చెందిన షెహజాద్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా సాన్నిహిత్యానికి దారి తీసింది. దీంతో యువకుడు ఆమెను తన వద్దకు రావాలని కోరాడు. అయితే ఆ మహిళకు పెళ్లయి.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా ఆమె యువకుడి మాటలు నమ్మి యూపీ వెళ్లింది.
షెహజాద్‌ను కలుసుకొన్న ఆమె పెళ్లి చేసుకుందామని కోరింది. దీనిని అతను తిరస్కరించడంతో వివాహం చేసుకోవాల్సిందేనని ఒత్తిడి తెచ్చింది. ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన కోపోద్రిక్తుడైన షెహజాద్ దుపట్టాతో ఆమెను కట్టేసి, ఇటుకతో తలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఏం చేయాలో తెలియక షెహజాద్ ఆమె మృతదేహాన్ని తాను పని చేస్తున్న కంపెనీ ఆవరణలో పడేసి వెళ్లిపోయాడు. అనుమానాస్పద స్థితితో ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ఈ షాకింగ్ విషయాలు తెలిశాయి. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
మరోవైపు.. మహిళ అదృశ్యంపై బాన్సువాడ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదైంది. తన భార్య కనిపించడం లేదంటూ భర్త ముఖీద్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. బాన్సువాడలో నివాసం ఉంటున్న ముఖీద్ భార్య ఉస్మా బేగం ఈ నెల 6 న కనిపించకుండా పోయింది. ఆమె ఆచూకీ కోసం ఆరా తీసినా లాభం లేకపోవడంతో చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఉత్తర ప్రదేశ్ లో ఉస్మాబేగం హత్యకు గురైన విషయం తెలిసింది. 12 ఏళ్ల క్రితం ఉస్మా బేగంకు ముఖీద్ తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కొద్ది రోజులుగా వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. పెద్దలు జోక్యం చేసుకుని సయోధ్య కుదిర్చారు. ఇది జరిగిన రెండు రోజుల్లోనే ఆమె ఇంటి నుంచి అదృశ్యమైంది. ఈ క్రమంలో దారుణ హత్యకు గురైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..