కన్న తల్లిపైనే కర్కశత్వం.. మంచంపై పడుకోనివ్వని కూతురు..అంతలోనే ఊహించని దారుణం..

ఆ తల్లి.. కూతురిని న‌వ మాసాలు మోసి క‌ని పెంచింది.. అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంంటూ వచ్చింది. కానీ.. ఆమె వృద్ధాప్యంలోకి చేరుకునే సరికి.. కూతురికి తల్లి బరువైంది. త‌ల్లి ప‌ట్ల దుర్మార్గంగా ప్రవర్తించింది.

కన్న తల్లిపైనే కర్కశత్వం.. మంచంపై పడుకోనివ్వని కూతురు..అంతలోనే ఊహించని దారుణం..
Crime
Follow us

|

Updated on: Nov 13, 2022 | 5:09 AM

ఆ తల్లి.. కూతురిని న‌వ మాసాలు మోసి క‌ని పెంచింది.. అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంంటూ వచ్చింది. కానీ.. ఆమె వృద్ధాప్యంలోకి చేరుకునే సరికి.. కూతురికి తల్లి బరువైంది. త‌ల్లి ప‌ట్ల దుర్మార్గంగా ప్రవర్తించింది. పడుకోవ‌డానికి మంచం ఇవ్వకుంటూ ఆ తల్లిని హింసించింది. కూతురు ప్రవర్తనతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన త‌ల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ దారుణ ఘ‌ట‌న భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ పట్టణంలో చోటుచేసుకుంది.

స్థానికుల వివరాల ప్రకారం.. పాల్వంచ పట్టణంలోని బ్రహ్మణ బ‌జార్‌కు చెందిన‌ సావిత్రి అనే మ‌హిళ కిరాణా స్టోర్ న‌డుపుకుంటూ జీవ‌నం కొన‌సాగిస్తోంది. సావిత్రికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు ల‌క్ష్మీ. అయితే ల‌క్ష్మీ, సావిత్రి మ‌ధ్య గ‌త కొన్ని రోజుల నుంచి పలు విషయాల్లో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా మంచం, పాత్రల విష‌యంలో వీరద్దరి మధ్య మనస్పర్ధలు చెల‌రేగాయి. దీంతో ఇద్దరు గొడవపడ్డారు.

ఈ సమయంలో సావిత్రికి పడుకునేందుకు మంచం ఇవ్వడానికి కూతురు ల‌క్ష్మీ నిరాక‌రించింది. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన సావిత్రి.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకుంది. మంటలకు శరీరం పూర్తిగా కాలిపోయింది.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో అప్రమత్తమైన స్థానికులు.. ఇంటికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అనంతరం తీవ్రగాయాలైన సావిత్రిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి త‌ర‌లించారు. సావిత్రి ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..