Andhra Pradesh: చిత్తూరులో కరెంటు తీగల ఉచ్చుకు మరో గజరాజు బలి.. మన్యం జిల్లాలో ఏనుగు దాడిలో..

సరిగ్గా పదిరోజులక్రితం ఇదే మండలం, ఇదే గ్రామంలో సేమ్‌ టు సేమ్‌ ఇలాగే విద్యుత్‌షాక్‌తో మరణించింది ఓ ఏనుగు. పొలంలో ఏర్పాటుచేసిన విద్యుత్‌ తీగలు తగిలి మృత్యువాతపడింది.

Andhra Pradesh: చిత్తూరులో కరెంటు తీగల ఉచ్చుకు మరో గజరాజు బలి.. మన్యం జిల్లాలో ఏనుగు దాడిలో..
Elephants
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 13, 2022 | 6:10 AM

చిత్తూరు జిల్లా వి.కోట మండలం నాగిరెడ్డిపల్లిలో మరో గజరాజు ప్రాణాలు కోల్పోయింది. వన్యప్రాణులను వేటాడేందుకు పెట్టిన విద్యుత్‌ తీగలు తగిలి ఓ ఏనుగు నేలకొరిగింది. దాంతో, పొలంలో విద్యుత్‌ తీగలను ఏర్పాటుచేసిన నిందితులు సురేష్‌, కృష్ణప్పను పోలీసులు అరెస్ట్ చేశారు. సరిగ్గా పదిరోజులక్రితం ఇదే మండలం, ఇదే గ్రామంలో సేమ్‌ టు సేమ్‌ ఇలాగే విద్యుత్‌షాక్‌తో మరణించింది ఓ ఏనుగు. పొలంలో ఏర్పాటుచేసిన విద్యుత్‌ తీగలు తగిలి మృత్యువాతపడింది. పదిరోజుల గ్యాప్‌లో రెండు ఏనుగులు విద్యుత్‌ తీగలకు బలైపోవడం స్థానికంగా కలకలం రేపుతోంది.

ఏనుగుల నుంచి తమ పొలాలను కాపాడుకునేందుకు రైతులే విద్యుత్‌ తీగలను పెడుతున్నారా? లేక ఇది వేటగాళ్ల పనో? తేల్చేందుకు దర్యాప్తు మొదలుపెట్టారు ఫారెస్ట్‌ అధికారులు. మరో ఏనుగు విద్యుత్‌ తీగలకు బలైపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పొలాల్లో విద్యుత్‌ తీగలు ఏర్పాటుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అయితే, ఆహారం కోసం అడవుల్లో నుంచి పొలాల్లోకి వస్తోన్న గజరాజులు.. తమకు తెలియకుండానే విద్యుత్‌ షాక్‌కి గురై మృత్యువాత పడుతున్నాయి.

పార్వతీపురం మన్యం జిల్లాలో..

ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం-మన్యం జిల్లా కొమరాడ మండలం కలికోట్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున 46 ఏళ్ల గోవింద అనే వ్యక్తి ఏనుగు దాడిలో మరణించాడు. సీతానగరం, బలిజిపేట, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం తదితర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ఒక ఏనుగు గుంపు సంచరిస్తూ గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తోంది.

ఇవి కూడా చదవండి

పార్వతీపురం-మన్యం జిల్లా అటవీశాఖ అధికారి జీఏపీ ప్రసూనతోపాటు సీనియర్ అటవీ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ఘటనపై ఆరా తీశారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఆహారం, నీరు లేకపోవడంతో జంతువులు జనవాసాల్లోకి వస్తున్నాయని.. ఆటపట్టించవద్దని ప్రజలను కోరారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!