Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి దర్శనానికి 40 గంటలు.. క్యూ లైన్లలో భక్తుల పడిగాపులు..

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వారాంతాలు, సెలవు రోజులు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుగిరులు జన సంద్రాన్ని తలపించాయి. క్యూ కంపార్ట్‌మెంట్లు నిండాయి...

Tirumala: శ్రీవారి దర్శనానికి 40 గంటలు.. క్యూ లైన్లలో భక్తుల పడిగాపులు..
Tirumala Queue Lines
Follow us
Ganesh Mudavath

|

Updated on: Nov 13, 2022 | 7:11 AM

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వారాంతాలు, సెలవు రోజులు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుగిరులు జన సంద్రాన్ని తలపించాయి. క్యూ కంపార్ట్‌మెంట్లు నిండాయి. 57,104 మంది స్వామి వారిని దర్శించుకోగా.. 32,351 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హుండీలకు రూ.4.66 కోట్లు ఆదాయం వచ్చింది. శ్రీవారి దర్శన టోకెన్లు లేని భక్తులకు స్వామి దర్శనానికి 40 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమలలో శనివారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. చలి తీవ్రత కూడా పెరగడంతో క్యూ లైన్లల్లో ఉన్న భక్తులు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులకు వరస సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తిరుమలకు తమ స్వంత వాహనాల్లో పయనమయ్యారు. దీంతో తిరుపతిలోని చెక్ పాయింట్ల వద్ద తనిఖీల కోసం వాహనాలు బారులు తీరాయి. 12 క్యూలైన్లలో క్షుణ్నంగా చెకింగ్ చేస్తుండటంతో వాహనాలు నత్త నడకన ముందుకు కదులుతున్నాయి.

మరోవైపు.. కాణిపాకం స్వయంభు గణపతి స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తులకు అభయ హస్తం అందించారు. సంకటహర చతుర్థి సందర్భంగా ఇరు దేవేరులతో కలిసి స్వర్ణ రథంపై ఊరేగారు. ఆలయంలో పవిత్రోత్సవాలు, మండల పూజల్లో భాగంగా రెండో రోజు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. వరస సెలవుల కారణంగా కాణిపాకంలోనూ భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వరసిద్ధి వినాయకుడిని దర్శించుకునేందుకు సుమారు నాలుగు గంటలు పట్టింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..