Minister RK Roja: మంత్రి రోజాకు మరోసారి నిరసన సెగ.. గ్రామ సచివాలయానికి తాళం..
ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజాకు మరోసారి నిరసన సెగ తగిలింది. వడమాలపేటలో ఆమె ప్రారంభించాల్సిన గ్రామ సచివాలయానికి స్థానిక జెడ్పీటీసీ తాళం వేశారు. విషయం తెలుసుకున్న మంత్రి రోజా అనుచరులు...

ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజాకు మరోసారి నిరసన సెగ తగిలింది. వడమాలపేటలో ఆమె ప్రారంభించాల్సిన గ్రామ సచివాలయానికి స్థానిక జెడ్పీటీసీ తాళం వేశారు. విషయం తెలుసుకున్న మంత్రి రోజా అనుచరులు సచివాలయం భవనం తాళాలు పగలగొట్టి ఓపెన్ చేయడం గమనార్హం. సచివాలయం భవనాన్ని నిర్మించేందుకు వెచ్చించిన మొత్తంలో రూ.25 లక్షలు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని విడుదల చేయకుండా కొత్త భవనాన్ని ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి రోజా స్పందించారు. బిల్లులు పూర్తయినా మంజూరు కాలేదని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇటీవల కాలంలో మంత్రి రోజాకు నగరి వైసీపీ నుంచి తరచూ నిరసనలు వ్యక్తం అవుతున్నారు. ఒకానొక సందర్భంల్లో ఈ విషయాన్ని మంత్రి రోజానే స్వయంగా చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా తిరుపతి జిల్లా పడమాలపేట మండలం పత్తిపుత్తూరు సచివాలయాన్ని ప్రారంభించేందుకు మంత్రి రోజా వెళ్లారు. స్థానిక జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి ఆమె పర్యటనను అడ్డుకున్నారు. ఒకే ప్రాంగణంలో సచివాలయం, ఆర్బీకే, పాల శీతలీకరణ కేంద్రాలు నిర్మించామని.. రూ.34 లక్షలు వెచ్చించగా.. ఆ డబ్బుల్లో ఇంకా రూ.23 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ సమయంలోనే ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయడం, మంత్రి రోజా పర్యటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాకే భవనాలను ప్రారంభించాలని తాళాలు వేశారు.
అయితే మంత్రి రోజా అనుచరులు ఊరుకోలేదు. బలవంతంగా తాళాలు పగలగొట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. జడ్పీటీసీతో పాటు ఆయన సోదరుడు రవిరెడ్డిని అరెస్టు చేశారు. ఇంత జరుగుతున్నా.. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినా మంత్రి రోజా సచివాలయాన్ని ప్రారంభించడం గమనార్హం.




మరిన్ని ఏపీ వార్తల కోసం..