AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana News: ఇదేం వింత.. బాలిక కంటి నుంచి కన్నీళ్లతో పాటు బియ్యం, రాళ్లు..

ఎవరైన ఏడిస్తే కళ్లలోంచి నీళ్లు వస్తాయి. కానీ ఈ అమ్మాయికి కన్నీళ్లతోపాటు బియయం, రాళ్లు కూడా వస్తాయి. వినడానికి కొంత వింతగా అనిపిస్తున్నా.. ఇలాంటి ఘటన తాజాగా తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూసింది.

Telangana News: ఇదేం వింత.. బాలిక కంటి నుంచి కన్నీళ్లతో పాటు బియ్యం, రాళ్లు..
Deepali
Sanjay Kasula
|

Updated on: Nov 13, 2022 | 12:03 PM

Share

“ఇంద్రియాణాం నయనం ప్రధానం” ఇంద్రియాలన్నింటిలో కన్ను అత్యంత ప్రధానం. అంతేకాదు అది అత్యంత సున్నితం కూడా.. అలాంటి కంటిలో చిన్న నలుసు పడితే చాలు ప్రాణం పోతుందా అన్నట్లుగా ఉంటుంది. ఆ క్షణం విలవిలలాడిపోతాం.. ఏదో అయిపోయిందనే అయోమయం అవుతుంది. కానీ ఓ చిన్నారి కంటి నుంచి ఏకంగా రాళ్లు, బియ్యం గింజలు బయటపడుతున్నాయి. అయితే గతంలో చాలామంది కళ్లల్లోంచి ఇలా రాళ్లు రావడం సాధారణమే అయినా, ఈ బాలికకు రోజూ రాళ్లు కంటి నుంచి బయటకు వస్తున్నాయి. కంటిలో చిన్న నలుసు పడితేనే విలవిలలాడుతాం మనం. అలాంటిది ఓ చిన్నారి కంటిలో నుంచి ఏకధాటిగా రాళ్లు, బియ్యపు గింజలే వస్తున్నాయి. రెండ్రోజుల నుంచి నొప్పితో తీవ్ర అవస్థలు పడుతోంది. వినడానికి వింతగా ఉన్న ఈ సంఘటన జోగులాంబ గద్వాలజిల్లాలో చోటుచేసుకుంది.మానవపాడులోని రంగన్న, లక్ష్మి దంపతుల కూతురు దీపాలి కళ్లలోంచి చిన్న చిన్న రాళ్లు, బియ్యం గింజలు బయటకు వస్తున్నాయి.

గత రెండు రోజులు నుండి చిన్నారి ఈ బాధతో విలవిలాడుతోంది. కర్నూలులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యులు స్కానింగ్‌ పరీక్షక్షలు చేసినా..ఏం లేదని తేల్చేశారు. దాంతో దీపాలిని మళ్లీ ఇంటికి తీసుకొచ్చారు.

ప్రతిరోజు పాప కంటి నుంచి 10 నుంచి 12 చిన్న చిన్న రాళ్లు, బియ్యపు గింజలు బయటకు వస్తున్నాయి. ఇది వింత అనిపించినా..ఆ చిన్నారి మాత్రం తీవ్రమైన నొప్పితో బాధపడుతోంది. ఏం చేయాలో అర్థంకాక దీపాలి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం