Pelli Sandadi: ప్రేక్షకుల ఎదురు చూపులకు ఫుల్‌ స్టాప్‌.. ‘పెళ్లి సందD’ ఓటీటీ ఎంట్రీ కన్ఫామ్‌.. ఎప్పుడు, ఎక్కడ రానుందంటే..

Pelli Sandadi OTT: సీనియర్‌ హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'పెళ్లి సందD'. ఈ సినిమాతో కన్నడ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది..

Pelli Sandadi: ప్రేక్షకుల ఎదురు చూపులకు ఫుల్‌ స్టాప్‌.. 'పెళ్లి సందD' ఓటీటీ ఎంట్రీ కన్ఫామ్‌.. ఎప్పుడు, ఎక్కడ రానుందంటే..
Pelli Sandadi Ott
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 22, 2022 | 7:24 AM

Pelli Sandadi OTT: సీనియర్‌ హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పెళ్లి సందD’. ఈ సినిమాతో కన్నడ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమాతోనే కుర్రకారును ఫిదా చేసిన ఈ బ్యూటీ, సినిమా విజయంలోనూ ముఖ్యపాత్ర పోషించింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేయడంతో ఈ సినిమాపై అందరిలోనూ భారీగా అంచనాలు పెరిగాయి.

గౌరి రోనంకి దర్శకత్వం వహించడిన ఈ సినిమా గతేడాది అక్టోబర్‌ 15న థియేటర్లలో వడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. సాధారణంగా ప్రస్తుతం ఏ సినిమా అయినా థియేటర్లలో విడుదలైన రెండు నెలలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అయితే పెళ్లి సందD చిత్రం మాత్రం దీనికి భిన్నంగా ఓటీటీలోకి రావడానికి చాలా సమయం తీసుకుంది.

దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు డిజిటల్‌ స్క్రీన్‌పై చూద్దామా అని ఎదురు చూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ తేదీని కాన్ఫామ్‌ అయ్యింది. దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైందీ చిత్రం. జూన్‌ 24న ‘జీ5 ‘ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ5 అధికారికంగా ప్రకటించింది. ఓటీటీ టీజర్‌ను విడుదల చేస్తూ.. ‘పెళ్లి సందD చేయడానికి రెడీనా? మా సినిమా రేడీ! ముహుర్తం: 24 జూన్, అందరూ ఆహ్వానితులే..’ అంటూ క్యాప్షన్‌ జోడించారు. దీంతో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ వస్తోన్న ప్రేక్షకులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..