Apple iPhones: యాపిల్ ఐ ఫోన్ల తయారీలో మన గిరిజన మహిళలు.. కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్..

యాపిల్‌కు చెందిన ఐఫోన్‌లు భారత్‌లోనే తయారవుతున్నాయని స్పష్టం చేశారు. అతి త్వరలో బెంగళూరు సమీపంలో అతిపెద్ద ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి..

Apple iPhones: యాపిల్ ఐ ఫోన్ల తయారీలో మన గిరిజన మహిళలు.. కీలక ప్రకటన చేసిన  కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్..
Apple Iphone Manufacturing
Follow us

|

Updated on: Nov 15, 2022 | 8:50 PM

కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ఓ కీలక ప్రకటన చేశారు. ఇప్పుడు యాపిల్‌కు చెందిన ఐఫోన్‌లు భారత్‌లోనే తయారవుతున్న సంగతిని గుర్తు చేశారు. అయితే రాబోయే రోజుల్లో గిరిజన మహిళలు ఈ కంపెనీలో ఐఫోన్లు తయారీలో పని చేస్తారని అన్నారు. అతి త్వరలో బెంగళూరు సమీపంలో అతిపెద్ద ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి. ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఈయన ఈ ప్రకటన చేశారు. “సంతోషకరమైన విషయం ఏమిటంటే, గిరిజన సమాజానికి చెందిన మా సోదరీమణులు కూడా భారతదేశంలో ఐఫోన్‌లను తయారు చేస్తారు” అంటూ ప్రకటించారు. లార్డ్ బిర్సా ముండా జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నివాళి అర్పించారు. అనంతరం ట్వీట్ చేశారు ‘ధర్తి ఆబా’ భగవాన్ బిర్సా ముండాజీ జయంతి సందర్భంగా ఆయనకు వందనాలు. అంటూ పేర్కొన్నారు.

5జీ టెక్నాలజీ కోసం 100 ల్యాబ్‌..

దేశవ్యాప్తంగా 5జీ టెక్నాలజీ కోసం 100 ల్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు భారత ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. ఇందులో 12 ల్యాబ్‌లు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించబడతాయి. కొత్త టెలికాం బిల్లు కోసం తమ ఇన్‌పుట్‌లను ఇవ్వాలని ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో పాల్గొనే కంపెనీలను ఆయన కోరారు. కొత్త టెలికాం బిల్లు సహాయంతో ప్రభుత్వం లైసెన్సింగ్ వ్యవస్థను సరళీకృతం చేయాలనుకుంటోంది.

బిర్సా ముండా జయంతి..

బిర్సా ముండా (1875–1900) భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు. ఇతడు ముండా జాతికి చెందినవాడు. 19వ శతాబ్దపు చివరి రోజుల్లో నేటి బీహార్, ఝార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో బ్రిటిషు కాలంలో జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించాడు. తద్వారా భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడు. ఇతడి గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటం ఉంది. ఈ విధంగా సత్కరింపబడిన ఏకైక ఆటవిక జాతుల నాయకుడు బిర్సా ముండా..

బ్రిటిషు వలసవాదంపై తిరుగుబాటుగా సాగిన భారతీయ స్వాత్రంత్ర్య పోరాటంలో పాల్గొన్న యోధునిగా బిర్సా ముండా పేరును అత్యంత గౌరవంతో ప్రస్తావిస్తారు. కనీసం పాతికేళ్లు కూడా దాటకుండానే ఇవన్నీ సాధించడం వల్ల ఈయన ఘనత మరింత ఉత్కృష్టమైనది.

మరిన్ని జాతీయ వార్తల కోసం