AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny: ట్రెండ్ మారింది.. ఇక్కడ అబ్బాయిలూ చీరలు కట్టుకున్నారు..

కాలం మారుతున్న కొద్దీ.. మనుషుల ఆలోచనలు మారిపోతున్నాయి. నిన్న ఛీ అనుకున్నది.. నేడు ఫ్యాషన్ అవుతుంది. సాధారణంగా అబ్బాయిల కోసం ఓ రకమైన దుస్తులు, అమ్మాయిల కోసం ఓ రకమైన దుస్తులంటూ డిజైన్ చేశారు. కాలం కొద్దీ ట్రెండ్..

Funny: ట్రెండ్ మారింది.. ఇక్కడ అబ్బాయిలూ చీరలు కట్టుకున్నారు..
Groom Sport Saree
Amarnadh Daneti
|

Updated on: Nov 15, 2022 | 9:44 PM

Share

కాలం మారుతున్న కొద్దీ.. మనుషుల ఆలోచనలు మారిపోతున్నాయి. నిన్న ఛీ అనుకున్నది.. నేడు ఫ్యాషన్ అవుతుంది. సాధారణంగా అబ్బాయిల కోసం ఓ రకమైన దుస్తులు, అమ్మాయిల కోసం ఓ రకమైన దుస్తులంటూ డిజైన్ చేశారు. కాలం కొద్దీ ట్రెండ్ మారుతుండటంతో అమ్మాయిలు కూడా ఫ్యాంటు, షర్టులు వేసుకోవడం ఫ్యాషన్ అయింది. అయితే వారి కోసం ఆ దుస్తులు ప్రత్యేకంగా తయారవుతాయి. కాని మహిళలు కట్టుకునే చీరలు.. అబ్బాయిలు కట్టుకునే ఫ్యాషన్ ఇంకా రాలేదు. ఏదో సరదాగా కట్టుకున్న.. అబ్బాయిలు చీరలు కట్టుకుని బయట తిరిగితే నవ్వుతారు.. కానీ అమెరికాలో మాత్రం ఇద్దరు అబ్బాయిలు ఓ ఇండియన్ పెళ్లికి వెళ్తూ.. చీరలు కట్టుకున్నారు. ఇప్పుడు ఈ పోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కాలం మారుతున్న కొద్దీ ఫ్యాషన్‭లో కొత్త ట్రెండ్‭ వస్తోంది. చికాగోలో జరిగిన తమ భారతీయ స్నేహితుడి పెళ్లిలో ఇద్దరు పురుషులు చీరలు ధరించి కనిపించారు. ఆడవాళ్లు జీన్స్, టీ షర్ట్ ధరించినట్లు.. ఇప్పుడు వీరు చీరలో ప్రత్యేక్షమై తమ స్నేహితుడిని సర్ ప్రైజ్ చేశారు. అంతేకాదు వీరిద్దరూ చీరలో వాక్ చేస్తూ.. అందరిని ఆశ్చర్యపరిచారు. ఇన్ని రోజులు మహిళలు మాత్రమే చీర కట్టుకోవాలి అనే పద్దతిని ఈ ఇద్దరు స్నేహితులు మార్చేశారు.

చికాగోకు చెందిన వెడ్డింగ్ వీడియోగ్రాఫర్‌లు అయిన పారాగాన్‌ఫిల్మ్స్, వారి ఇన్‌స్టాగ్రామ్‭లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఇద్దరు అబ్బాయిలు తమ స్నేహితుడి వివాహానికి రెడీ అవుతూ ఉంటారు. అయితే.. వీరిద్దరూ చీర కట్టుకునేందుకు ఓ మహిళ సహాయం చేస్తుంది. పెళ్లికి వెళ్లేందుకు రెడీ అయిన వీరిద్దరూ… చికాగోలోని మిచిగాన్ అవెన్యూలో రంగురంగుల చీరలు ధరించి అందంగా నడుచుకుంటూ హొయలు ఒలికించారు.

వాళ్ల స్టైల్ చూసి అక్కడున్న వారంతా ఫ్లాట్ అయ్యారు. నుదుటి పై బొట్టు పెట్టుకుని అచ్చం అమ్మాయిలా రెడీ అయ్యారు. వధూవరులు ఇద్దరూ వీరిని చూసి తెగ నవ్వుకున్నారు. ముగ్గురూ ఒకరినొకరు కౌగిలించుకుని నవ్వుకున్నారు. ఇక అబ్బాయిలు చీరలు కట్టుకోవడం కూడా ఫ్యాషన్ కాబోతుందా అంటూ నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..

Follow Us
ఆధార్ కార్డులో ఫొటో ఎన్నిసార్లు మార్చుకోవచ్చు? ఈ రూల్స్..
ఆధార్ కార్డులో ఫొటో ఎన్నిసార్లు మార్చుకోవచ్చు? ఈ రూల్స్..
2 ప్రపంచకప్‌లు అందించిన తోపు.. టెస్ట్‌లకు మాత్రం నో ఎంట్రీ..!
2 ప్రపంచకప్‌లు అందించిన తోపు.. టెస్ట్‌లకు మాత్రం నో ఎంట్రీ..!
రియల్‌మీ మినీ ఫ్రిజ్‌ గురించి తెలుసా? ధర అందుబాటులోనే
రియల్‌మీ మినీ ఫ్రిజ్‌ గురించి తెలుసా? ధర అందుబాటులోనే
ఉదయాన్నే టీ, కాఫీలు మానేసి ఇది ఒక్క గ్లాస్ తాగితే మీ చిట్టి గుండె
ఉదయాన్నే టీ, కాఫీలు మానేసి ఇది ఒక్క గ్లాస్ తాగితే మీ చిట్టి గుండె
నొప్పి పుట్టించే సూది మందుకు గుడ్‌బై.. త్వరలో తాగగలిగే ఇంజెక్షన్‌
నొప్పి పుట్టించే సూది మందుకు గుడ్‌బై.. త్వరలో తాగగలిగే ఇంజెక్షన్‌
పర్సనల్‌ కూలింగ్‌ బాక్స్‌ తెచ్చేసిన గోద్రెజ్.. ధర ఎంతంటే
పర్సనల్‌ కూలింగ్‌ బాక్స్‌ తెచ్చేసిన గోద్రెజ్.. ధర ఎంతంటే
ఇంట్లోనే ఫుడ్ బిజినెస్‌ ప్రారంభించండి..రూ.10 లక్షల వరకు ప్రయోజనం
ఇంట్లోనే ఫుడ్ బిజినెస్‌ ప్రారంభించండి..రూ.10 లక్షల వరకు ప్రయోజనం
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
జెబ్రానిక్స్‌ సౌండ్‌ ఫీస్ట్‌ 45 పోర్టబుల్ స్పీకర్‌‌.. వివరాలివే
జెబ్రానిక్స్‌ సౌండ్‌ ఫీస్ట్‌ 45 పోర్టబుల్ స్పీకర్‌‌.. వివరాలివే
గేదె యజమాని ఎవరు? తేల్చేందుకు డీఎన్‌ఏ పరీక్ష
గేదె యజమాని ఎవరు? తేల్చేందుకు డీఎన్‌ఏ పరీక్ష